ఐటీ కారిడార్‌లో ప్రత్యేక మహిళల బస్సు ప్రారంభం: వీసీ సజ్జనార్ సూచన

హైదరాబాద్: నగరంలోని ఐటీ కారిడార్‌లో మహిళల కోసం ప్రత్యేక బస్సును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) సోమవారం ప్రారంభించింది. జేఎన్టీయూ-వేవ్‌రాక్ మార్గంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ బస్సు నడుస్తుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలోనే మరిన్ని ప్రత్యేక బస్సులను కూడా టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేయనుందని ఆయన తెలిపారు. ఐటీ కారిడార్‌లో రాకపోకలకు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని మహిళలను కోరుతున్నట్లు సజ్జనార్ పేర్కొన్నారు. మహిళల ప్రత్యేక బస్సుకు సంబంధించిన ప్రయాణికుల వీడియోను ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

Ladies special rtc bus launched in Hyderabad IT corridor route

కాగా, ఈ బస్సు జేఎన్‌టీయూ నుంచి వేవ్‌ రాక్‌ వరకు పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా నడుపుతోంది. హైదరాబాద్‌ నగర పరిధిలో ఉన్న ఐటీ కంపెనీల్లో దాదాపు 4 లక్షల మంది వరకు మహిళా ఉద్యోగులు పని చేస్తున్నట్లుగా అంచనా. వారి కోసం ప్రత్యేకంగా బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా పెలైట్‌ ప్రాజెక్టుగా సోమవారం నుంచి బస్‌ను నడుపుతోంది.

ఈ బస్సు జేఎన్‌టీయూ నుంచి ఉదయం 9.05 గంటల నుంచి బయలుదేరి.. నెక్సస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్‌స్పేస్, రాయదుర్గం, బయో డైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఎక్స్‌రోడ్, ఇందిరా నగర్, ఐఐటీ ఎక్స్ రోడ్, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్స్ మీదుగా వెళ్తుంది.

తిరిగి సాయంత్రం 5.50 గంటలకు వేవ్‌ రాక్‌ నుంచి ఆయా మార్గాల ద్వారా జేఎన్‌టీయూకు చేరుకుంటుంది. ప్రయోగాత్మకంగా నడుపుతున్న సర్వీసు విజయవంతమైతే మరిన్ని మార్గాల్లో నడిపించాలని ఆర్టీసీ భావిస్తోంది. కొత్తగా అందుబాటులోకి వస్తున్న ప్రత్యేక బస్సును మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. తాజాగా, ఈ బస్సుకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో మరిన్ని బస్సులు నడిపేందుకు సిద్ధమవుతోంది ఆర్టీసీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+