షాకింగ్ పని.. లేడీ అఘోరీ, వర్షిణి అరెస్ట్!
తెలుగు రాష్ట్రాలలో రచ్చ చేసిన లేడీ అఘోరి కి ఊహించని షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మోకిలా పోలీసులు లేడీ అఘోరీని అరెస్టు చేశారు. నగ్న పూజల పేరుతో ఒక మహిళ నుంచి పది లక్షల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడినట్టు మహిళ చేసిన ఫిర్యాదుతో లేడీ అఘోరి పైన కేసు నమోదు చేశారు పోలీసులు.
లేడీ అఘోరీ అరెస్ట్
లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ నగ్న పూజల పేరుతో తన వద్ద నుండి 10 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశారని తిరిగి డబ్బులు అడిగినందుకు తనను చంపేస్తానని బెదిరింపులకు దిగారని ఒక మహిళ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి అఘోరీ ని అరెస్ట్ చేశారు.

అఘోరీపైన చీటింగ్ కేసు
అఘోరి పైన చీటింగ్ కేసు నమోదు చేసిన మోకిలా పోలీసులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దులలో అఘోరీని అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకువస్తున్నారు.
లేడీ అఘోరి తో పాటు ఇటీవల అఘోరీ ని పెళ్లి చేసుకున్న వర్షిణిని కూడా పోలీసులు తీసుకువస్తున్నారు. ఆరునెలల క్రితం లేడీ అఘోరీతో తనకు పరిచయం అయిందని పరిచయమైన రెండు నెలల తర్వాత పొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్ కు డిన్నర్ కు వచ్చిందని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నగ్న పూజ .. మహిళ దగ్గర నుండి 10లక్షలు
అప్పటినుంచి లేడీ అఘోరి తనకు తరచుగా ఫోన్లు చేస్తూ వ్యక్తిగత విషయాలను తెలుసుకుంటూ, ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పిందని మహిళా వెల్లడించారు. లేడీ అఘోరి మాటలు నమ్మి తను పూజకు అంగీకరించానని పేర్కొన్నారు. వారం రోజుల్లో పూజ చేద్దామని చెప్పిన లేడీ అఘోరి అందుకు ఖర్చులకోసం ఐదు లక్షలు తన అకౌంట్లో వేయమని అడిగారని తాను చెప్పినట్టే డబ్బు పంపానని పేర్కొంది.
డబ్బుల కోసం మహిళకు బెదిరింపులు
ఆ తర్వాత పూజ కోసం యూపీలోని ఉజ్జయినిలోని ఫామ్ హౌస్ లోకి తీసుకువెళ్లి నగ్న పూజ చేసిందని షాకింగ్ విషయం చెప్పింది. మరుసటి రోజు మరో ఐదు లక్షలు తన అకౌంట్లో వేయాలని లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరి తనను భయపెట్టినట్టుగా సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మొత్తం పది లక్షల రూపాయలు లేడీ అఘోరి కి పూజ కోసం ఇచ్చానని తెలిపారు.
పోలీసులకు మహిళ ఫిర్యాదు.. లేడీ అఘోరీ అరెస్ట్
అక్కడితో వదలని లేడీ అఘోరి మళ్లీ మరొక ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని లేదంటే నిన్ను నీ కుటుంబ సభ్యులను తన మంత్ర శక్తితో అంతమొందిస్తానని బెదిరింపులకు పాల్పడినట్టు సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు లేడీ అఘోరీని అరెస్టు చేసి తీసుకువస్తున్నారు.












Click it and Unblock the Notifications