KCR Health Bulletin: కేసీఆర్ తాజా పరిస్దితి ఇదే-మరో హెల్త్ బులెటిన్ విడుదల

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిన్న నిర్వహించిన తుంటి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. దీంతో డాక్టర్లు ఆయన్ను సాధారణ రూమ్ కు మార్చి పోస్ట్ ఆపరేషన్ కేర్ అందిస్తున్నారు. నిన్న దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి డాక్టర్లు ఆయనకు సర్జరీ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో 24 గంటల్లో కేసీఆర్ ఆరోగ్య పరిస్ధితిపై ఇవాళ యశోద ఆస్పత్రి డాక్టర్లు వివరాలు వెల్లడించారు. ఈ వివరాలు ఆయన అభిమానులకు ఊరటనిచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే పలువురు వీఐపీలు కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.

కేసీఆర్ తాజా ఆరోగ్య పరిస్ధితిపై ఇవాళ సాయంత్రం 6గంటలకు యశోద ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇందులో
కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించింది. సర్జరీ తర్వాత కేసీఆర్ కు తుంటి నొప్పి కూడా క్రమంగా తగ్గుతోందని అందులో తెలిపింది. ప్రస్తుతం ఆయన్ను ప్రత్యేక వైద్యుల బృందం పరిశీలనలో ఉంచినట్లు హెల్త్ బులెటిన్ లో తెలిపారు. ఇప్పటికే కేసీఆర్ కు సర్జరీ తర్వాత ఆరు నుంచి 8 వారాల విశ్రాంతి అవసరం అవుతుందని డాక్టర్లు ప్రకటించారు.

latest health bulletin released on former cm kcrs health- here are updates

నిన్న మధ్యాహ్నం నిర్వహించిన తుంటి మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్ ప్రత్యేక వైద్యుల పరిశీలనలో నడుస్తున్నారని కూడా యశోద ఆస్పత్రి హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. అలాగే కేసీఆర్ వేగంగా కోలుకునేందుకు వీలుగా ఆయనకు ప్రత్యేక మెడికేషన్ అందిస్తున్నట్లు కూడా తెలిపారు. ఆయన చేయాల్సిన ఎక్సర్ సైజుల షెడ్యూల్ కూడా ఇచ్చామన్నారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్న తీరుపై ఆయనకు సర్జరీ నిర్వహించిన డాక్టర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు హెల్త్ బులిటెన్ లో తెలిపారు.

latest health bulletin released on former cm kcrs health- here are updates

మరోవైపు నిన్న సర్జరీ పూర్తి చేసుకున్న కేసీఆర్ సాధారణంగా పూర్తిగా కోలుకునేందుకు మరో 6 నుంచి 8 వారాలు పడుతుందని అంచనా వేసినట్లు డాక్టర్లు నిన్నటి హెల్త్ బులిటెన్ లో వెల్లడించారు. కానీ ఎప్పుడు అన్నది పేర్కొనలేదు. ఇవాళ్టి హెల్త్ బులిటెన్ లోనూ డిశ్చార్జ్ గురించిన ప్రస్తావన లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+