Bodakonda waterfalls:ఈ లాంగ్ వీకెండ్‌లో బోడకొండ జలపాతపు అందాలు చూసేద్దామా..!
ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆఫీసు పనిలో బిజి బిజిగా గడిపేస్తున్నారు చాలామంది. ఎక్కడికైనా వెళ్దామన్న ఆలోచన వచ్చినా సెలవులు లేవని ఆలోచించేవాళ్లు మరికొందరు. అలాంటివారికోసమే ఈ లాంగ్ వీకెండ్..ఈ మధ్యకాలంలో ఉద్యోగులకు సెలవులు కలిసొస్తున్నాయి. సండే హాలిడే, సోమవారం గాంధీజయంతి హాలీడే.. ఇలాంటి సమయంలో లాంగ్ వీకెండ్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నరా? అయితే, మరెందుకాలస్యం.. ఈ లాంగ్ వీకెండ్‌లో హైదరాబాద్‌కు సమీపంలోని ఈ బోడకొండ జలపాతపు అందాలను చూసేయండి..
బోడకొండ జలపాతపు అందాలు : ఎడతెగని కార్యకలాపాలతో రోజంతా బిజిగే గడిపే హైదరాబాద్ వాసులు వీకెండ్‌లో ఎక్కువ శాతం బ్రేక్ తీసుకునేందుకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. హైదరాబాద్‌లో వీకెండ్‌లో హాయిగా, సరాదాగా గడిపేందుకు ఎన్నో ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, హైదరబాద్‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడికి సమీపంలోని జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. జలపాతాలు అనగానే.. బొగత జలపాతం, కుంతాల, పొచ్చర్ల జలపాతాలే టక్కున్న గుర్తొస్తాయి. అయితే, వీటిని చూడాలంటే కాస్త లాంగ్ జర్నీ చేయాల్సి ఉంటుంది. ఒక్కరోజులో అక్కడి ప్రకృతి అందాలను చూసి తిరిగి రావడమంటే కష్టమైన పననే చెప్పుకోవాలి. అయితే, అవి కాకుండా ఈ ప్రదేశంలోని మరో జలపాతమే బోడకొండ జలపాతం. ఈ మధ్యకాలంలో ఈ జలపాతం ప్రసిద్ధి చెందింది.

ఎలా వెళ్లాలి : హైదరాబాద్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొడకొండ వాటర్‌ఫాల్స్ ఎడతెరపి లేని వర్షాలతో జలకళను సంతరించుకుంది. ఈ వాటర్‌ఫాల్స్‌ను చేరుకోవాలంటే ముందుగా నాగార్జునసాగర్ హైవే మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు నాగార్జున సాగర్ అందాలను తిలకించేయండి. ఆ తర్వాత బొడకొండ జలపాతానికి మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి. ఈ హైవే నుంచి మధ్యలో లోయపల్లి రోడ్డు ఒకటి కనిపిస్తుంది. అక్కడి నుంచి ఎడమ వైపు వెళ్లాల్సి ఉంటుంది. మంచాల మండలం నుండి12.4 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే బోడకొండ జలపాతాన్ని చేరుకోవచ్చు.
ప్రకృతి అందాలలో సేదతీరండి : గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు బోడకొండ జలపాతం పచ్చదనంతో, జలకళంతో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎటుచూసినా, కొండలు, పచ్చని పొలాలు, ప్రకృతి అందాల మధ్య బోడకొండ జలపాతపు అందాలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటి వరకూ కేవలం ఈ గ్రామస్థులకే మాత్రమే తెలిసినా ఈ జలపాతం. ఇప్పుడు ఒక టూరిస్ట్ స్పాట్‌గా ప్రసిద్ధి చెందింది. అడ్వంచెర్ ట్రిప్స్‌ని ఇష్టపడే యూత్ వల్లే ఈ ప్రాంతం గురించి అందరికి తెలిసింది. అయితే, ఈ ప్రాంతం వర్షాకాలంలో టూరిస్టుల ఫేవరేట్ ప్లేస్‌గా మారింది.

ఎల్లమ్మ తల్లి దేవాలయం : ఈ జలపాతం దగ్గర్లోనే ఎల్లమ్మ తల్లి దేవాలయం కూడా ఉంది. ఈ గ్రామస్థులు ఈ ఆలయ దేవతను కొలుస్తారు. ఎంతో మహిమ కలిగిన తల్లి ఎల్లమ్మ తల్లి అని ఈ గ్రామస్థుల నమ్మకం. సమీపంలోని చాలామంది గ్రామస్థులు ఈ దేవాలయానికి వస్తుంటారు. ఈ ప్రదేశమంతా పక్షుల కిలకిలరావాలతో ఆహ్లదభరితంగా ఉంటుంది. ఈ ప్రాంతం బర్డ్స్ ప్రేమికులకు ఎంతగానో నచ్చుతుంది. ఈ జలపాతంలో పదికి పైగా కొండల మీదునుంచి నీళ్లు కిందకి పడుతుంటాయి. ఇదే ఈ జలపాతపు విశిష్టత. సమీపంలో చిన్న చిన్నదుకాణాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి సంతోషంగా గడిపియొచ్చు. మరెందుకాలస్యంలో ఈ లాంగ్ వీకెండ్‌లో బోడకొండ జలపాతపు అందాలు చూసేయండి మరి..












Click it and Unblock the Notifications