ధర్మపురి వ్యభిచార కేంద్రాలకు మరో 5 జిల్లాలతో లింక్ ? ... బాలికలు ఆ జిల్లాల వారేనా ?

దత్తత పేరుతో అనాధ బాలికలను పెంచుకుంటామని తెచ్చి వారితో వ్యభిచారాన్ని చేయిస్తున్న ధర్మపురి వ్యభిచార కేంద్రాల తీగలాగితే డొంక కదులుతోంది. ఇక్కడ వ్యభిచార కేంద్రాల తో మరో ఐదు జిల్లాలకు లింక్ ఉందా అన్న అనుమానాలు పోలీసులకు వ్యక్తమవుతున్నాయి.

బాలికలను చైల్డ్ హోం కు తరలించిన పోలీసులు

బాలికలను చైల్డ్ హోం కు తరలించిన పోలీసులు

అక్కడ దొరికిన ఇటువంటి ఐదుగురు బాలికలను నిర్వాహకులు యాదగిరిగుట్ట నుండి తెచ్చి ఉంటారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.జగిత్యాల జిల్లా ధర్మపురి వ్యభిచార కేంద్రాలపై దాడులు చేసిన పోలీసులు ఐదుగురు బాలికలను గుర్తించారు. ప్రస్తుతం ఈ బాలికలను కరీంనగర్ లోని చైల్డ్ హోంకు తరలించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి దానితో పాటుగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.

బాలికల ఆచూకీ కనుగొనేందుకు యత్నం

బాలికల ఆచూకీ కనుగొనేందుకు యత్నం

ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ అందులో ఉన్న వివరాలు తప్పుడు వివరాలు గా పోలీసులు భావిస్తున్నారు. వీరికి ఊహ తెలియని వయసు నుండే కొనుగోలు చేసి తీసుకొని వచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. బాలికలను వివరాలు అడిగినా చెప్పలేని పరిస్థితిలో బాలికలున్నారు.

జగిత్యాల వ్యభిచార కేంద్రాలను మరో 5 జిల్లాలతో లింకుపై పోలీసుల దర్యాప్తు

జగిత్యాల వ్యభిచార కేంద్రాలను మరో 5 జిల్లాలతో లింకుపై పోలీసుల దర్యాప్తు

వరంగల్ అర్బన్ జిల్లాలోని హసన్ పర్తి నుండి కానీ, పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం నుండి కానీ, నిజామాబాద్ జిల్లా నందిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా లోని యాదగిరిగుట్ట నుండి కానీ , జగిత్యాల జిల్లా కేంద్రం నుండి కానీ ఈ బాలికలను తీసుకొని వచ్చి పెంచుతున్నట్లు గా భావిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఐదు జిల్లాల్లోని వివిధ వ్యభిచార కేంద్రాల తోటి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యభిచార కేంద్రాలలో అన్యం పుణ్యం తెలియని బాలికలు బలైపోతున్నారు అన్నది తాజా ఘటనతో వెలుగులోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+