Bank Holidays: సెప్టెంబర్‌లో 17 రోజులు బ్యాంక్ సెలవులు, ఈ తేదీల్లోనే

న్యూఢిల్లీ: సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు సగం నెల కంటే ఎక్కువ రోజులే సెలవులు ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో పలు ప్రముఖ పండగలు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో హైదరాబాద్‌లోని బ్యాంకులకు మొత్తం ఎనిమిది రోజులపాటు సెలవులు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అయితే, ఈ నెలలో దేశ వ్యాప్తంగా నాలుగు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతో కలిపి మొత్తం 17 సెలవులు ఉండటం గమనార్హం.

కాగా, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సెలవులు ఒకేలా ఉండకపోవచ్చు.దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి బ్యాంక్ మొత్తం 17 రోజులు మూసివేయబడదు. హైదరాబాద్‌లో నాలుగు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారం బ్యాంకులు మూతపడనున్నాయి. వీటితోపాటు అదనంగా సెప్టెంబర్ 7, 18, 28 తేదీల్లో బ్యాంకులు మూసివేయబడి ఉంటాయి.

List of Bank Holidays in September 2023

సెప్టెంబర్ నెలలో బ్యాంక్ సెలవులు:
3 సెప్టెంబర్: ఆదివారం
6 సెప్టెంబర్: శ్రీకృష్ణ జన్మాష్టమి
7 సెప్టెంబర్: శ్రీకృష్ణ జయంతి (గుజరాత్, మధ్యప్రదేశ్, చంఢీగఢ్, సిక్కిం, రాజస్థాన్, జమ్మూ, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్ లలో సెలవులు )
9 సెప్టెంబర్: రెండవ శనివారం
10 సెప్టెంబర్: ఆదివారం
సెప్టెంబర్ 17: ఆదివారం

సెప్టెంబర్ 18: వరసిద్ధి వినాయక వ్రతం, వినాయక చవితి.
సెప్టెంబర్ 19: గణేష్ చతుర్థి.(గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, గోవా ప్రాంతాలలో 19వ తేదీ సెలవు దినం)
సెప్టెంబర్ 20: గణేష్ చతుర్థి 2వ రోజు నుఖాయ్ ఒడిశాలో దీన్ని జరుపుకుంటారు
సెప్టెంబర్ 22: శ్రీ నారాయణ గురు సమాధి చెందిన రోజు. కేరళలో ఇది ప్రాంతీయ సెలవు.

సెప్టెంబర్ 23: నాల్గవ శనివారం. ఇదేరోజు మహారాజా హరి సింగ్ పుట్టిన రోజు. జమ్మూ, శ్రీనగర్ లో ప్రాంతీయ సెలవురోజు.
సెప్టెంబర్ 24: ఆదివారం
సెప్టెంబర్ 25: ఈద్ ఇ మిలాద్ ఉన్ నబీ
సెప్టెంబర్ 27: మిలాద్ ఎ షరీఫ్ (మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు)
సెప్టెంబర్ 28: ఈద్ అల్ అధా లేదా మిలాదున్నబి. ఈరోజు జాతీయ సెలవు దినం. అన్ని బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 30: ఆదివారం.

అయితే, ఈ ప్రతేక రోజులలో బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ.. ఆన్‌లైన్ సేవల ద్వారా బ్యాంకింగ్ పనులను నిర్వహించుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+