Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాదులో టాప్ 10 అత్యంత ధనవంతుల లిస్ట్ ఇదే..!

మారుతున్న కాలానుగుణంగా హైదరాబాద్‌ నగరం భారతదేశంలోనే ముఖ్యమైన ఆర్ధిక శక్తిగా ఎదుగుతోంది. ఫార్మా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, ఎనర్జీ, సోలార్ పవర్ వంటి విభిన్న రంగాల్లో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తలు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ రంగంలో నగరానికి ఉన్న బలమైన పునాది, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ హైదరాబాద్ సంపన్నుల సంపదను గణనీయంగా పెంచుతోంది. భారీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు, రహదారులు, నీటిపారుదల, విద్యుత్ రంగాల్లో జరిగిన పెట్టుబడులు నగర ఆర్థిక వ్యవస్థకు మరింత ఊపునిచ్చాయి.

అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా హైదరాబాద్ దేశంలోని టాప్ నగరాల్లో ఒకటిగా నిలవడం వల్ల ఈ రంగానికి చెందిన వ్యాపారవేత్తలు సంపన్నుల జాబితాలో పెద్ద సంఖ్యలో చోటు దక్కించుకుంటున్నారు. తాజా అంచనాల ప్రకారం హైదరాబాద్‌లో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కలిగిన వారు వంద మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సంఖ్య దేశంలో ముంబై, ఢిల్లీ తర్వాత మూడో స్థానంలో హైదరాబాద్ నిలవడం విశేషం. ఈ క్రమంలోనే నగరంలోని అత్యంత ధనవంతుల జాబితాను ప్రముఖ సంస్థ వెల్లడించింది.

list-of-top-10-richest-people-in-hyderabad

టాప్ 10 వీరే..?

1. మురళి దివి కుటుంబం - దివీస్ ల్యాబొరేటరీస్

హైదరాబాద్‌లో అత్యంత సంపన్న కుటుంబంగా దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి దివి కుటుంబం నిలిచింది. సుమారు రూ.91,100 కోట్ల నెట్ వర్త్తో ఈ కుటుంబం మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. గ్లోబల్ ఫార్మా మార్కెట్‌లో దివీస్ ల్యాబ్‌కు ఉన్న బలమైన స్థానం, ఎగుమతులు, పరిశోధన రంగంలో చేసిన పెట్టుబడులు ఈ అపార సంపదకు కారణంగా నిలిచాయి.

2. పిచ్చి రెడ్డి - మేఘా ఇంజినీరింగ్ (MEIL)

రెండో స్థానంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (MEIL) అధినేత పిచ్చి రెడ్డి ఉన్నారు. ఆయన నెట్ వర్త్ సుమారు రూ.42,650 కోట్లు. దేశవ్యాప్తంగా భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, పవర్, రోడ్లు, ఇన్‌ఫ్రా రంగాల్లో MEIL విస్తరణ ఈ స్థాయికి చేర్చింది.

3. పి.వి. కృష్ణ రెడ్డి

మూడో స్థానంలో పి.వి. కృష్ణ రెడ్డి ఉన్నారు. ఆయన సంపద విలువ సుమారు రూ.41,810 కోట్లు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కన్‌స్ట్రక్షన్ రంగాల్లో చేసిన పెట్టుబడులు ఆయనను హైదరాబాద్ టాప్ రిచ్ లిస్ట్‌లో ముందువరుసలో నిలిపాయి.

4. బి. పార్థసారధి రెడ్డి - హెటెరో ల్యాబ్స్

నాలుగో స్థానంలో హెటెరో ల్యాబ్స్ అధినేత బి. పార్థసారధి రెడ్డి ఉన్నారు. సుమారు రూ.39,030 కోట్ల నెట్ వర్త్తో ఆయన ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. హెటెరో ల్యాబ్స్ ప్రపంచవ్యాప్తంగా జనరిక్ డ్రగ్స్ తయారీలో కీలక పాత్ర పోషిస్తోంది.

5. కే. సతీష్ రెడ్డి కుటుంబం - డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్

ఐదవ స్థానంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు చెందిన కే. సతీష్ రెడ్డి కుటుంబం నిలిచింది. వారి సంపద సుమారు రూ.39,000 కోట్లు. భారతీయ ఫార్మా రంగంలో విశ్వసనీయ బ్రాండ్‌గా డాక్టర్ రెడ్డీస్ ఎదగడం దీనికి ప్రధాన కారణం.

6. పి.వి. రామ్‌ప్రసాద్ రెడ్డి - ఆరోబిందో ఫార్మా

ఆరో స్థానంలో ఆరోబిందో ఫార్మా అధినేత పి.వి. రామ్‌ప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయన నెట్ వర్త్ సుమారు రూ.35,000 కోట్లు. అంతర్జాతీయ ఫార్మా మార్కెట్‌లో ఆరోబిందో ఫార్మాకు ఉన్న పట్టు ఆయనను ఈ స్థాయికి చేర్చింది.

7. మహిమ దత్ల - బయాలజికల్ ఈ

ఫార్మా, వ్యాక్సిన్ రంగంలో ముందంజలో ఉన్న బయాలజికల్ ఈ సంస్థను నడిపిస్తున్న మహిమ దత్ల ఏడవ స్థానంలో నిలిచారు. పరిశోధన, వ్యాక్సిన్ తయారీలో సంస్థ సాధించిన విజయాలు ఆమె సంపదకు బలంగా మారాయి.

8. సురేందర్ సలూజా కుటుంబం - ప్రీమియర్ ఎనర్జీస్

ఎనిమిదవ స్థానంలో సోలార్ ఎనర్జీ రంగానికి చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ అధినేత సురేందర్ సలూజా కుటుంబం ఉంది. పునరుత్పాదక శక్తి రంగంలో పెరుగుతున్న డిమాండ్ ఈ కుటుంబ సంపదను వేగంగా పెంచుతోంది.

9. జూపల్లి రామేశ్వర్ రావు - రియల్ ఎస్టేట్

తొమ్మిదవ స్థానంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త జూపల్లి రామేశ్వర్ రావు ఉన్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్‌లో ఆయన కీలక పాత్ర పోషిస్తూ భారీ ఆస్తులు సంపాదించారు.

10. సుబ్రమణ్యం రెడ్డి & వెంకటేశ్వర రెడ్డి - అపర్ణ కన్స్ట్రక్షన్స్

పదవ స్థానంలో అపర్ణ కన్స్ట్రక్షన్స్‌కు చెందిన సుబ్రమణ్యం రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి నిలిచారు. రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులతో హైదరాబాద్ నిర్మాణ రంగంలో అపర్ణకు ఉన్న పేరే వారి సంపదకు ఆధారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+