లైవ్‌లో శోభనం చూడాలనుకుంటున్నారా.. కేవలం రూ.2 వేలకే..!

సోషల్ మీడియా, లైవ్ స్ట్రీమింగ్ యాప్‌ల వినియోగం హద్దు మీరితే.. ఎలా ఉంటుందో తెలియజెప్పడానికి కొన్ని కొన్ని వెలుగులోకి వచ్చే ఘటనలే అందుకు ఉదాహరణ. ఇప్పుడు కొత్తగా మరో వ్యవహారం బయటపడింది. ముఖ్యంగా విదేశాల్లో విస్తరించిన న్యూడ్ సెక్స్ లైవ్ స్ట్రీమింగ్ సంస్కృతి ఇప్పుడు భారతదేశానికి కూడా చేరుకుంటోందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ధోరణి వేగంగా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కొందరు.. తమ వ్యక్తిగత విషయాలను ఆన్‌లైన్‌లో డబ్బుల కోసం బయటపెడుతున్నారు.

డబ్బు కోసం శృంగారాన్ని లైవ్‌..

హైదరాబాద్ అంబర్‌పేట ప్రాంతంలో ఓ జంట లైవ్ స్ట్రీమింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 'స్వీట్ తెలుగు కపుల్' పేరుతో వీరు ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించి అశ్లీల కంటెంట్‌ను సృష్టిస్తున్నారు. నాణ్యమైన కెమెరాలు ఉపయోగించి శృంగార సన్నివేశాలను లైవ్ స్ట్రీమ్ చేస్తూ.. రూ.2,000 లైవ్ లింక్, రూ.500 వీడియో కాపీలు కోసం వసూలు చేస్తున్నారు. సమాచారం ప్రకారం వీరు నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తోంది.

live-streaming-for-two-thousand-by-couple-at-hyderabad-and-news-got-viral

వైరల్ అవుతున్న షాకింగ్ ట్రెండ్..

ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. "ప్రేమ, వ్యక్తిగత క్షణాలను వ్యాపారంగా మార్చడం ఎంతవరకు సమంజసం?" అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చాలామంది దీనిని భారతీయ సంస్కృతికి తగని విషయంగా ఖండిస్తున్నారు. విదేశాల్లో ఇలాంటి లైవ్ స్ట్రీమింగ్ సంస్కృతి సహజంగా కనిపించినా.. భారతదేశంలో ఇది సామాజిక విలువలకు పెద్ద ముప్పు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సైకాలజిస్టులు కూడా దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత క్షణాలను డబ్బు కోసం బహిర్గతం చేయడం తాత్కాలిక లాభాలా అనిపించినా.. దీర్ఘకాలంలో మానసిక ఒత్తిడి, సంబంధాల విరగడం, సామాజిక అవమానం వంటి సమస్యలకు దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు వ్యసనంగా మారితే, వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా నాశనం చేసే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు.

live-streaming-for-two-thousand-by-couple-at-hyderabad-and-news-got-viral

కాగా సోషల్ మీడియా నిపుణులు దీనిని "క్లౌట్ కల్చర్"గా అభివర్ణిస్తున్నారు. అంటే కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా, ఫేమ్ కోసం ఎలాంటి రిస్క్‌కైనా వెళ్ళే ధోరణి అని వారు అంటున్నారు. కానీ ఇలాంటి చర్యలు చివరికి చట్టపరమైన కేసులు, జైలు శిక్షలు వంటి సమస్యలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ విభాగం ఈ తరహా లింకులు, వెబ్‌సైట్‌లను ట్రాక్ చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+