మద్యం లాక్ డౌన్ తో జోరుగా కల్తీ కల్లు... తయారీ ఎలానో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం !!
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటిస్తే మద్యం షాపులు కూడా లాక్ డౌన్ అయ్యాయి . మద్యం షాపులు లాక్ డౌన్ సందర్భంగా మూత పడటంతో మందు బాబులు మద్యం లేక ప్రత్యామ్నాయంగా కల్లు బాట పట్టారు. దీంతో కల్లుకు గిరాకీ బాగా పెరిగింది. అయితే డిమాండ్ కు తగ్గట్టు కల్లు లేకపోవటంతో కల్తీ కల్లుకు తెరతీశారు కల్లు గీత కార్మికులు. ప్రజల ప్రాణాలతో కల్తీ కల్లుతో చెలగాటం ఆడుతున్నారు.

జోరుగా కల్తీ కల్లు దందా .. డిమాండ్ ఎక్కువ ఉండటమే కారణం
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి విధించిన లాక్ డౌన్ ఎఫెక్ట్ మద్యం ప్రియుల మీద దారుణంగా పెరిగింది . ఇక మద్యం షాపుల బంద్ కొనసాగుతున్న నేపధ్యంలో దీంతో సహజసిద్ధంగా వచ్చే తాటికల్లు, ఈతకల్లుకు గిరాకీ పెరిగింది. మందుబాబులంతా కల్లు వంక చూస్తున్న నేపధ్యంలో కల్తీ కల్లు జోరందుకుంది. చెట్ల నుండి వచ్చే సహజ సిద్ధమైన కల్లు ప్రస్తుతం ఉన్న డిమాండ్ కు తగ్గట్టు లేకపోవటంతో కల్లు గీత కార్మికులు కల్తీలకు దిగారు.

కల్లుకు బానిసలైన వారి బలహీనత ఆసరాగా కల్తీ కల్లు అమ్మకాలు
చాలా మంది దినసరి కూలీలు ఇప్పటికే కల్లు కాంపౌండ్ లను మూసివెయ్యటంతో ఆందోళన చెందుతూ పిచ్చి వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. కరోనాతో చనిపోయినా మంచిదే కానీ కల్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డెక్కి మరీ ఆందోళన చేస్తున్నారు. తాగకుంటే చచ్చిపోతాం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు . ఇక వీరి బలహీనత ఆసరాగా చేసుకున్న కల్లు గీత కార్మికులు అందిన కాడికి దండుకుంటున్నారు.

కల్తీ కల్లుతయారీ ఇలా
విచ్చలవిడిగా కల్తీలకు పాల్పడుతున్నారు . ఎక్కువ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయినా సరే కల్లుకు బానిసలుగా మారిన వారు దాని కోసం వెంపర్లాడుతున్నారు .
ఇక ఈ కల్తీ కల్లు ఎలా తయారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కల్లు తయారీలో యూరియా, కుంకుడు కాయల రసం, పులుపు కోసం నిమ్మ ఉప్పు , శాక్రిన్ పొడి, బియ్యం పిండిని ఉపయోగిస్తున్నారు. ప్రతి జిల్లాలో వేల లీటర్ల కల్తీ కల్లు తయారీ జోరుగా జరుగుతుంది . పెద్ద పెద్ద డ్రమ్ములు , బకెట్లలో తయారు చేసి కుండలకు కుండలే అమ్ముతున్నారు .ఇక ఈ కల్తీకల్లుతో చాలా ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు వైద్యులు .
Recommended Video

కల్తీకల్లుతో యమ డేంజర్ .. తేడా వస్తే ప్రాణాలే పోయే ప్రమాదం
కల్తీ కల్లులో కలపాల్సిన మోతాదులో యూరియా తదితరాలు కలపకుంటే , మోతాదును మించి కలిపితే వాంతులు , విరోచనాలతో ప్రాణాలు గాలిలో కలిసిపోవటం గ్యారెంటీ . ఇక అసలు కల్తీ కల్లు తాగితే కడుపులో కూడా యూరియా తదితరాల ప్రభావం దారుణంగా ఉంటుంది . కాబట్టి కల్తీ కల్లు హాని చేస్తుందన్న విషయం గుర్తుంచుకుని ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. మద్యం షాపులు మూసివేసినంత మాత్రాన కల్లు కోసం పరుగులు తీసి ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి .
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications