Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలింగ్ సక్సెస్ గెట్ టుగెదర్: ప్రైవేట్ పార్టీలో డ్యాన్స్ స్టెప్పులతో ఇరగదీసిన కొత్తగూడెం ఎస్పీ

ఎప్పుడు కేసులతో, క్రిమినల్స్ ను పట్టుకునే పనిలో బిజీగా ఉండే, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పనిచేసే పోలీసులు ఆటవిడుపు కోసం గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నారు. ప్రస్తుత ఈ గెట్ టు గెదర్ పార్టీలో జిల్లా ఎస్పీ డాన్స్ స్టెప్పులతో అదరగొట్టిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎన్నికల పోలింగ్ సక్సెస్ చేసిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ నిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో బిజీగా ఉంటారు. ఇక ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఎప్పటికప్పుడు మావోయిస్టుల కదలికలను కనిపెడుతూ, వారికి చెక్ పెట్టే వ్యూహాలతో అప్రమత్తంగా ఉంటారు. ఇక తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అనేక ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలు కాగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ పూర్తి చేశారు.

Lok sabha Polling success get together bhadradri Kottagudem SP super dance at private party

పోలింగ్ సక్సెస్ చేసిన సిబ్బందికి గెట్ టుగెదర్
ఎన్నికల వేళ ఏజెన్సీ జిల్లాలో పోలీస్ బందోబస్తును సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.మే 13వ తేదీన జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్ ను విజయవంతం చేయడంలో పోలీస్ సిబ్బంది అందరూ కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో పోలీసుసిబ్బందికి ఏజెన్సీ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల బందోబస్తును సక్సెస్ ఫుల్ గా నిర్వహించిన సందర్భంగా గెట్ టుగెదర్ పార్టీ ని ఏర్పాటు చేశారు.

పాల్వంచలో ఒక ప్రైవేట్ పార్టీలో జిల్లా ఎస్పీ డ్యాన్స్
పాల్వంచలోని ఒక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ పార్టీలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పోలీసు సిబ్బందితో కలిసి సరదాగా డాన్స్ చేసే అలరించారు. సిబ్బందితో కలిసి మాస్ స్టెప్పులు వేసిన ఆయన మ్యాడ్ సినిమాలోని కళ్ళజోడు కాలేజీ పాప చూడు పాటకు అదిరిపోయేలా స్టెప్పులేసి ఆయనలో ఉన్న హిడెన్ టాలెంట్ ను బయటపెట్టారు.

ఎస్పీ డ్యాన్స్ వీడియోలు వైరల్
ఇక పోలీసు సిబ్బందితో కలిసి సరదాగా ఆయన డాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న కిందిస్థాయి పోలీస్ సిబ్బంది కూడా జిల్లా ఎస్పీ తమతో కలిసి డాన్స్ చేయడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కాలేజీలో చదువుకున్న రోజుల నుంచి మంచి డాన్సర్ అని, అందుకే ఆయన అంత బాగా డాన్స్ చేశారని జిల్లా పోలీసులు కితాబిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+