Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాలుగేళ్లుగా లవ్.. ఆ పనికి ఒప్పుకోలేదని 16 ఏళ్ల ప్రియుడు ఏం చేశాడంటే!

నాలుగేళ్లుగా మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను.. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అని.. ప్రియురాలి తండ్రికి ఓ ప్రియుడు ప్రపోజల్ పెట్టాడు. సాధారణంగా ఈ తరహా ఘటనల్లో అబ్బాయి జాబ్, కుటుంబం, ఆస్తితో పాటు పలు విషయాలను ఎంక్వైరీ చేసి అయితే ఒకే లేదంటే లేదు అని చెబుతుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే స్టోరీలో మాత్రం పెళ్ళికి ప్రాబ్లంగా మారింది వయస్సు.

ఎస్.. ఇక్కడ ఆ ప్రపోజల్ పెట్టిన అబ్బాయి వయస్సు 16 ఏళ్లు. ఇదే ట్విస్ట్ అనుకుంటే ఆ అబ్బాయి నాలుగేళ్ల నుంచి ప్రేమిస్తున్నా అని చెప్పడం ఇంకా పెద్ద ట్విస్ట్. పెళ్లి చేసుకోవాలనుకున్న బాలిక వయస్సు కూడా 16. ఆ బాలుడి పిల్లతనం అర్ధం చేసుకున్న అమ్మాయి తండ్రి.. ఆ అబ్బాయిని ఏం అనకుండా.. పెళ్లీడు వచ్చాక చూద్దాం అని చెప్పి పంపించేశాడు. అయితే ఆయన చేసిన పెద్ద తప్పు అదే అయ్యింది. పిల్లతనం అనుకుంటే ఆ పిల్లాడిలో రాక్షసుడు ఉన్నాడని ఆలస్యంగా బయట పడింది. పెళ్లికి అంగీకరించలేదనీ బాలిక తండ్రిపై పగ పెంచుకున్న బాలుడు. పెద్దాయన అడ్డుతొలగించుకోవాలని అనుకొని హత్యాయత్నం చేయడం కలకలంగా మారింది. ఈ షాకింగ్‌ ఘటన నిర్మల్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

Love for four years What did the 16-year-old boyfriend do when he did not agree to that work

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్‌లో నివాసం ఉంటున్న ఓ బాలుడు మేస్త్రీగా పని చేస్తున్నాడు. బాలుడు నివసిస్తున్న అదే కాలనీకే చెందిన మరో బాలిక వద్దకు వెళ్లి నాలుగేళ్లుగా తనను ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకుందామని బాలికను అడుగగా ఆమె అంగీకరించలేదు. దీంతో నేరుగా బాలిక తండ్రి వద్దకు వెళ్లి తమకు పెళ్లి చేయమని అడిగాడు. బాలుడి మాటలకు విస్తుపోయిన బాలిక తండ్రి ఇద్దరి వయసు చిన్నదేనని, పెళ్లి వయసు వచ్చాక మాట్లాడదామని నచ్చజెప్పి పంపించేశాడు.

ఈ క్రమంలోనే ఆయనపై కోపం పెంచుకున్న బాలుడు వైఎస్ఆర్ కాలనీకి చెందిన మహ్మద్‌ తౌసిఫ్‌ ఉల్లాతో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు. శనివారం అర్ధరాత్రి బాలిక ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న బాలిక తండ్రిపై కత్తెరతో దాడిచేసి, పలుమార్లు పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడితోపాటు, అతడికి సహకరించిన మహ్మద్‌ తౌసిఫ్‌ ఉల్లాను అరెస్టు చేశారు. నిందితులను కోర్టు ఎదుట హాజరుపరిచి అనంతరం రిమాండుకు తరలించినట్టు నిర్మల్ సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ రాజేశ్‌మీనా, పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. చిన్న పిల్లాడు అనుకుంటే ఇంతటి దారుణానికి ఒడిగడతాడని అనుకోలేదని బాధితుడు కుటుంబ సభ్యులు వాపోతున్నారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+