Most wanted criminal: బత్తుల ప్రభాకర్ నేరాలు చిట్టా మామూలుగా లేదు

హైదరాబాద్ నగరం గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద శనివారం రాత్రి పోలీసులపై కాల్పులకు పాల్పడిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్ గురించిన సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మోస్ట్ వాటెంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ నేరాల గురించి మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాకు వెల్లడించారు. బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి నివాసంలో పోలీసులు తనిఖీలు చేయగా 428 బుల్లెట్లు దొరికాయని తెలిపారు.

విచారణలో ప్రభాకర్ ఇచ్చిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ పాత నేరస్థుడు. 2022 మార్చిలో విచారణ నిమిత్తం ఏపీలోని అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో తప్పించుకుపోయాడు. అప్పట్నుంచి పరారీలోనే ఉన్నాడని డీసీపీ తెలిపారు.

Madhapur DCP reveals Bathula Prabhakar s crime list

శనివారం రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ దగ్గర ఉన్నాడనే సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపాడు ప్రభాకర్. దీంతో హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికి కాలికి బుల్లెట్ గాయమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని రెండు తొపాకులు, 23 తూటాలు సీజ్ చేశామని డీసీపీ వినీత్ వెల్లడించారు.

2013 నుంచి ప్రభాకర్ నేరాలు చేయడం ప్రారంభించాడని.. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని డీసీపీ తెలిపారు. తెలంగాణలో 11, ఏపీలో 12 కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని చెప్పారు. అంతేగాక, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో నేరాలకు పాల్పడినట్లు వెల్లడించారు. ఇళ్లలో చోరీ చేయడం రిస్క్ అని శివార్లలోని విద్య సంస్థల్లో దొంగతనాలు చేస్తున్నాడని, దొంగతనం చేసే ముందు రెక్కీ చేస్తాడని డీసీపీ చెప్పారు.

గతంలో జైల్లో ఉన్నప్పుడు ఓ ఖైదీపై కక్ష పెంచుకున్న ప్రభాకర్.. అతడ్ని చంపాలని జైల్లో పరిచయమైన ఖైదీల సహకారంతో బీహార్‌లో తుపాకీ కొనుగోలు చేసినట్లు తెలిపారు. తుపాకీ కొనుగోలు, నేరాలు చేయడానికి సహకరించిన వారందర్నీ అరెస్ట్ చేస్తామని డీసీపీ తెలిపారు.

నేరాలకు పాల్పడి పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలో యూట్యూబ్‌లో నిందితుడు ప్రభాకర్ వీడియోలు చూస్తాడని డీసీపీ తెలిపారు. ఇప్పటి వరకు 66 కేసుల్లో ప్రభాకర్ అరెస్టయ్యాడన్నారు. 8 నెల క్రితం నుంచి తుపాకులు వాడుతున్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+