మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
హైదరాబాద్: మహారాష్ట్రలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నాందేడ్ జిల్లాలోని ధర్మాబాద్ మండలం భాబాలీ గ్రామ పంచాయతీలో స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసి సర్పంచ్ తోపాటు అన్ని వార్డులలో కూడా విజయం సాధించారు. వీరంతా కూడా గతంలో టీఆర్ఎస్ మద్దతుదారులుగా ఉండటం గమనార్హం.
గతంలో తమ గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలో కలుపుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరిన విషయం తెలిసిందే. కేసీఆర్ సర్కారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఈ గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు. అందుకే తాము కూడా తెలంగాణలో కలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

కాగా, మహారాష్ట్రలోని 34 జిల్లాల్లోగల 14,234 గ్రామపంచాయితీలకు గత వారం ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. బ్యాలెట్ పద్ధతిలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించడం, కొవిడ్ ప్రొటోకాల్ కారణంగా కౌంటింగ్ నిదానంగా సాగుతోంది. రాత్రి 10 గంటల వరకు 12, 503 పంచాయితీల్లో లీడ్లు వెలవడ్డాయి. ఆ లెక్కల ప్రకారం..
Recommended Video
ఇప్పటివరకు వెల్లడైన సమాచారం ప్రకారం మహారాష్ట్రలోని మొత్తం 14,234 పంచాయితీలకుగానూ, 2,912 చోట్ల బీజేపీ బలపర్చిన అభ్యర్థులు ముందంజలో లేదా విజయం సాధించారు. 2,724 పంచాయితీల్లో శివసేన అభ్యర్థులు లీడ్ లేదా గెలుపు సాధించారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ బలపర్చిన అభ్యర్థులు 2,673 పంచాయితీల్లో పాగా వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 1905 పంచాయితీలను కైవసం చేసుకునే దిశగా వెళుతున్నారు. 2,289 పంచాయితీల్లో ఇతర పార్టీల అభ్యర్థులు లేదా ఇండిపెండెంట్లు ప్రభావం చూపించారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications