Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహారాష్ట్ర పాలిటిక్స్‌: అజిత్ పవార్ తొలగింపుకు ఎన్‌సీపీ వ్యూహాలు; కేటీఆర్ ట్వీట్!!

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మహా రాష్ట్ర రాజకీయాలలో అజిత్ పవార్ తాజా నిర్ణయం ప్రకంపనలు సృష్టించింది. కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ నిన్న బీజేపీ శివసేన కూటమి లో చేరారు. ఆయన షిండే మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అజిత్ పవార్ ను అసెంబ్లీ నుంచి తొలగించే విధంగా ఎన్సీపీ పావులు కదుపుతోంది.

ఇందులో భాగంగా ఇప్పటికే అజిత్ పవార్ కు వ్యతిరేకంగా మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వెకర్ కు పిటిషన్ పంపించారు. అజిత్ పవార్ ను డిస్ క్వాలిఫై చేయించేందుకు ఎన్సీపీ వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. మహారాష్ట్ర లో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై ఎన్సీపీ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే స్పందించారు.

Maharashtra Politics: NCP strategies to disqualify Ajit Pawar; KTR Shocking Tweet!!

అజిత్ పవార్ పార్టీని వీడి వెళ్లినంత మాత్రాన ఈ మార్పులు పార్టీ ఐకమత్యంపై ఎటువంటి ప్రభావం చూపదని ఆమె పేర్కొన్నారు. ఆయన చర్యలు శరద్ పవార్ స్థాయిని తగ్గించలేవని, దీనివల్ల శరద్ పవార్ స్థాయి మరింత పెరుగుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల్లో పార్టీపై ఉన్న విశ్వసనీయత అధికమవుతుందని ఆమె పేర్కొన్నారు.

ఇక ఇదే సమయంలో ఎప్పటికీ తాను అజిత్ పవార్ ను ద్వేషించే పరిస్థితి ఉండబోదని సుప్రియా సూలే పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మహా రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనూహ్య పరిణామాలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇకపై త్రిబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంటుందని షిండే వ్యాఖ్యలను పునరుద్ఘాటించిన కేటీఆర్ డబల్ ఇంజన్లు పాతబడిపోయాయని సెటైర్లు వేశారు.

ఇక ఇప్పుడు కొత్తగా వాషింగ్ మిషన్ తో నడిచే త్రిబుల్ ఇంజన్లు వచ్చాయని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహారాష్ట్ర పాలిటిక్స్ హ్యాష్ ట్యాగ్ తో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మహారాష్ట్రలో బీజేపీ రాజకీయాలను ప్రతిపక్షాలు తూర్పారబడుతున్నాయి. దేశం బీజేపీ తీరును చూస్తుందని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+