Mahbubnagar Lok Sabha Election 2024 Results LIVE: రేవంత్ గడ్డపై కాషాయం జెండా ఎగిరేనా...!!
మహబూబ్‌నగర్ లోక్‌సభ ఎన్నికల 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. హోరా హోరీ సమరం సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన రేవంత్ కు మెజార్టీ పార్లమెంట్ సీట్లు గెలవటం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.అందులో తన సొంత గడ్డ మహబూబ్ నగర్ ఎంపీ స్థానం పైన రేవంత్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. అక్కడ బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ బరిలో నిలిచారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. గెలుపెవరనేది ఆసక్తి కరంగా మారింది.
ప్రతిష్ఠాత్మక పోరు
మహబూబ్ నగర్ ఎంపీగా ఎవరు గెలుస్తారనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ సొంత జిల్లా కావటంతో అంచనాలు పెరిగాయి. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ఈ ఎంపీ పరిధిలోకే వస్తుంది. ఇక్కడ మెజార్టీ సాధించటం ద్వారా మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనేది రేవంత్ లక్ష్యం. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా చల్లా వంశీచంద్ రెడ్డి పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ బరిలో నిలిచారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

హోరా హోరీ పోరు
మహబూబ్ నగర్ లో త్రిముఖ పోరు కొనసాగుతున్నా..ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు నెలకొన్నట్లుగా పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. ఇక్కడ 71.54 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళి గమనించిన మూడు ప్రధాన పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ కు ఒకప్పుడు ఈ నియోజకవర్గం కంచుకోట. గతంలో కేసీఆర్ గెలిచిన నియోజకవర్గం కావటంతో ఆ పార్టీకి ఇక్కడ ఆశలు పెట్టుకుంది. ఇక..బీజేపీకి ఇక్కడ ఓట్ బ్యాంక్ బలంగా ఉంది. డీకే అరుణ జిల్లాలో సత్సంబంధాలు ఉన్న నేత కావటంతో పోటీ మరింత ఆసక్తి కరంగా మారింది.
గెలుపు దక్కేదెవరికి
మహబూబ్ నగర్ లోపోలింగ్ తరువాత డీకే అరుణ తన గెలుపు ఖాయమని చెప్పుకొచ్చారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని పార్టీలకు అతీతంగా చాలా మంది ఓటేశారని డీకే అరుణ స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో తెలంగాణలో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేసారు. దీంతో, మహబూబ్ నగర్ లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ఇక్కడ తన పార్టీ గెలుపు పైన నమ్మకంతో ఉన్నారు.బీఆర్ఎస్ నేతలు సైతం ఎన్నిక జరిగిన సరళితో తమకు అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో..అక్కడ గెలుపు ఎవరిదనేది కౌంటింగ్ లో స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications