వైరల్ వీడియో: ఛీ.. ఛీ.. అయ్యప్ప మాల ధరించి పాడు పనేంటి..?

తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో అయ్యప్ప మాలధారణ మనం చూస్తుంటాం. సాధారణంగా అయ్యప్ప మాల ధరించిన స్వాములు 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దీక్ష చేస్తారు. ఈ మాల ధరించిన భక్తులు కొన్ని నియమాలను నిష్టగా పాటించాలి. మెడలో తులసి లేదా రుద్రాక్ష మాల ధరించడం.. శాకాహారం మాత్రమే తినడం.. బ్రహ్మచర్యం పాటించడం.. శరీరాన్ని, మనసును నియంత్రణలో ఉంచుకోవడం.. దుర్భాషలకు దూరంగా ఉండడంతోపాటు నిత్యం భజన కార్యక్రమాల్లో పాల్గొనడం.. చేస్తుంటారు.

అయితే అయ్యప్ప స్వామి మాల ధరించిన ఓ వ్యక్తి మాత్రం పాడు పని చేశాడు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. అయ్యప్ప స్వామి మాల ధరించిన ఓ వ్యక్తి బీరు బాటిల్ పట్టుకుని కుర్చీలో కూర్చుని ఎంచక్కా తాగుతూ కనిపించాడు. అయ్యప్ప స్వామి మాల ధరించి ఇంతటి నీచమైన పనికి పూనుకున్నాడు. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి తన మొబైల్ లో బంధించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఈ దొంగ స్వామిని గుర్తించిన తోటి స్వాములు అతడిపై వాగ్వాదానికి దిగారు. హిందూ సంప్రదాయాల్లో ఎంతో పవిత్రమైనదిగా భావించే మాల ధరించి ఇలాంటి పాడు పనులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మాల తీసేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు సమాచారం ఇస్తామని తెలిపారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రాంతంలో జరిగినట్లుగా సమాచారం అందుతోంది. అయ్యప్ప స్వామి మాలలో ఆ వ్యక్తి చేతిలో బీరు బాటిల్ పట్టుకుని తాగుతున్న దృశ్యాలు కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

Mala Mockery Ayyappa Swami Caught Chugging Beer Viral Video Ignites Devotee Rage

తనను వీడియో తీస్తున్నారని గుర్తించిన దొంగ స్వామి అక్కడినుంచి తన బైక్ ను తీసుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే తోటి స్వాములు అతడిపై వాగ్వాదానికి దిగారు. అతడి బండి తాళం లాక్కున్నారు. పోలీసులకు సమాచారం ఇస్తామని తెలిపారు. నువ్ మనిషివా.. పశువువా అంటూ ఫైర్ అయ్యారు. ఈ వీడియో చూసిన భక్తులు, నెటిజన్లు దొంగ స్వామిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+