కంచ ఐలయ్యపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హిందూ సమాజాన్ని కించపరిచే పదజాలంతో పుస్తకాన్ని రాసిన కంచె ఐలయ్యపై కేసు నమోదు చేయాలని మల్కాజ్‌గిరి న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐలయ్యపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని మల్కాజ్‌గిరి తిరుమలనగర్‌కు చెందిన దళిత యువకుడు కె నాగరాజు కొన్ని రోజుల క్రితం స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

 Malkajgiri Court orders to file a case on Ilaiah

వాదనలు విన్న కోర్టు కంచ ఐలయ్యపై సెక్షన్‌ 153ఏ, 153బీ, 295ఏ, ఐపీసీ 509, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి నవంబర్ 10వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని మల్కాజిగిరి పోలీసులను ఆదేశించింది.

కాగా కంచ ఐలయ్య వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తతున్న విషయం తెలిసిందే. కోమటోళ్లు సామాజిక స్మగర్లు అంటూ ఓ వివాదాస్పద పుస్తకం కూడా ఐలయ్యా రాసిన విషయం విధితమే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Malkajgiri Court ordered to file a case on Kancha Ilaiah.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి