ఫేస్ బుక్ లో అభ్యంతరకరపోస్టులు,ఆమె చేసిందంటే ..!

ఓ యువతిని వేధించడమే కాకుండా పేస్ బుక్ లో ఆమె పై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన జీవన్ శర్మ అనే యువకుడిని అరెస్టుచేశారు పోలీసులు . అతనిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు.

హైదరాబాద్ :పరిచయం ఏర్పరచుకొన్న యువతిని వేధించడమే కాకుండా ఫేస్ బుక్ లో అసభ్యకరంగా వ్యాఖ్యలను పోస్ట్ చేసిన ఓ వ్యక్తిని ప్రబుద్దిడిని జవహర్ నగర్ పోలీసులు అరెస్టుచేశారు. అతనిపై రౌడీషీట్ ను కూడ ఓపెన్ చేశారు.

కరీంనగర్ జిల్లా రామగుండం కు చెందిన పిజి చదివే ఓ విధ్యార్థిని తో అదే ప్రాంతానికి చెందిన జీవన్ శర్మ అనే యువకుడు పరిచయం పెంచుకొన్నాడు. ఆ తర్వాత ఆ యువతికి హైద్రాబాద్ లోని హెచ్ ఎస్ బి సి లో ఉద్యోగం వచ్చింది. దీంతో ఆమె అల్వాల్ మండంలోని మచ్చబొల్లారం డివిజన్ పరిధిలో గల కౌకూర్ జనప్రియ అపార్ట్ మెంట్ లో ఉంటుంది.

man arrested for harassing woman in hyderabad

రామగుండంలో ప్రైవేట్ కంపెనీని ఏర్పాటుచేసుకొని జీవన్ శర్మ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆ యువతితో ఉన్న పరిచయం ఆధారంగా ఆ యువతి సెల్ ఫోన్ కు ప్రేమించాలని మేసేజ్ లు పంపుతూ వేధించేవాడు జీవన్ శర్మ.

తనను వేధిస్తున్నాడని ఆ యువతి గత ఏడాది ఏప్రిల్ 9వ, తేదిన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో జీవన్ శర్మ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ వేధింపులకు తాళలేక ఆమె మరోసారి గత ఏడాది సెప్టెంబర్ 3న, పోలీసులకు ఫిర్యాదుచేసింది.

దీంతో పోలీసులు మరో సారి కేసు నమోదుచేసి రామగుండం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయినా జీవన్ శర్మ లో మార్పు రాలేదు. పేస్ బుక్ లో ఆ యువతి సంబంధించిన వ్యక్తిగత విషయాలను అసభ్యకరంగా పోస్ట్ చేస్తూ మరింత వేధింపులకు గురిచేశాడు. దీంతో ఈ నెల మూడున ఐటి చట్టం ఐపిసి ప్రకారంగా కేసు నమోదుచేసి పోలీసులు ఆధారాలు సేకరించి ఆయనను అరెస్టుచేసి,రిమాండ్ కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+