ప్రేమ పేరుతో.. కోరిక తీర్చుకుని: పెళ్లి మాటెత్తేసరికి బయటపడ్డ 'మోసం'
ప్రేమిస్తున్నానని వెంటపడ్డ ఓ వ్యక్తి.. మాయ మాటలతో యువతిని లోబర్చుకుని మోసం చేశాడు.
మల్కాజ్‌గిరి: ప్రేమిస్తున్నానని వెంటపడ్డ ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతికి దగ్గరయ్యాడు. అతని మాయ మాటలు నమ్మిన యువతి.. శారీరకంగాను అతనికి దగ్గరయింది. ఆమెతో కోరికలు తీర్చుకున్న అతగాడు.. పెళ్లి మాటెత్తగానే యువతిని దూరం పెట్టేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళ్తే.. దమ్మాయిగూడకు చెందిన అవినాష్ (25) తన బంధువైన యువతి (26)ని ప్రేమిస్తున్నాని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని కూడా మాటివ్వడంతో.. యువతి అతని మాటలు నమ్మింది. తీరా పెళ్లి మాటెత్తేసరికి దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. అవినాష్ తనను మోసం చేశాడని గ్రహించిన బాధితురాలు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు అవినాష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications