మంచు ఫ్యామిలీ గొడవల వెనుక "ఆమె" - వెలుగులోకి కీలక అంశాలు..!!

సినీ పరిశ్రమతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మంచు కుటుంబంలో వివాదాల పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆస్తుల వివాదం గా కనిపిస్తున్నా..దీని వెనుక పలు కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. మోహన్ బాబు - మనోజ్ పరస్పర కేసులతో ఈ వ్యవహారం పోలీసు స్టేషన్ కు చేరింది. కాగా, తాజాగా విష్ణు - మనోజ్ మద్దతు దారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వివాదాల వెనుక కారణాలను మోహన్ బాబు ఇంటి పని మనిషి బయట పెట్టారు.

మోహన్ బాబు - మనోజ్ మధ్య అసలు వివాదం సిబ్బంది విషయంలో మొదలైందని.. అది పెరిగి ఘర్షణకు దారి తీసిందని వెల్లడించారు. మోహన్ బాబు సిబ్బంది ప్రసాద్ అనే వ్యక్తి తప్పు చేయటం తో మనోజ్ ప్రసాద్‌పై దాడి చేయబోయారు. తన సిబ్బందిపై చేయి వేయొద్దని మనోజ్‌కి మోహన్ బాబు చెప్పారని పేర్కొన్నారు. తన సిబ్బందికి తానే భయంలో పెట్టుకుంటానని మనోజ్‌ను తోసేశారని చెప్పారు. తర్వాత ఒకరినొకరు తోసుకున్నారని వివరిస్తూ.. తొలుత గొడవ అంతూ స్టాఫ్ గురించే జరిగిందని చెప్పారు. కొంత కాలంగా కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు ఈ వివాదంతో బయటకు వచ్చి..ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని వివరించారు.

Manchu Family maid reveals the facts behind disputes in Mohan Babu family and cases

మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు, విష్ణుకి ఏ మాత్రం ఇష్టం లేదని పని మనిషి వెల్లడించారు. తాజా గొడవలో మనోజ్‌కి ఎలాంటి గాయాలూ కాలేదని స్పష్టం చేశారు. అయితే, తండ్రీ - కొడుకుల మధ్య లోపల ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. కాగా, ఇద్దరూ ఒకరి పైన మరొకరు కేసులు పెట్టుకున్నారు. కాగా, తాజాగా మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. మనోజ్, విష్ణు వర్గాలకు చెందిన బౌన్సర్లు పెద్దఎత్తున జల్‌పల్లి నివాసానికి చేరుకోగా, ఇరువర్గాల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. మనోజ్‌కు సంబంధించిన బౌన్సర్లను విష్ణు ఇంటి నుంచి బయటకు పంపించి వేశారు. అలాగే విష్ణు బౌన్సర్ల సహాయంతో మనోజ్‌ను ఇంటి నుంచి బయటకు పంపించారు.

అయితే, పోలీసుల తీరు పైన మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తనను ఇంటి నుంచి పంపిస్తుంటే అడ్డుకోలేదని మనోజ్ ఆరోపించారు. ఆ తరువాత తన భార్యతో కలిసి మనోజ్ తెలంగాణ ఇంటలిజెన్స్ అధికారులను కలిసారు. ఇటు మనోజ్ ఇంట్లోకి రావటానికి వీల్లేదంటూ మోహన్ బాబు ఆదేశించారు. మనోజ్ సామాగ్రిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అటు మనోజ్ పోలీసుల సాయం కోరుతున్నారు. కర్నూలు నుంచి కొందరు మనోజ్ కు మద్దతుగా వచ్చినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు నివాసానికి పోలీసులు చేరుకున్నారు. దీంతో, ఈ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+