ఏంటబ్బా ఈ షాక్.. మూడు నెలల ముందే వచ్చేసిన "కింగ్ ఆఫ్ ఫ్రూట్" !

"కింగ్ ఆఫ్ ఫ్రూట్" అనగానే గుర్తొచ్చేది "మామిడి పండు". భారతదేశ జాతీయ ఫలంగా గుర్తింపు పొందిన మామిడి.. రుచిలో కూడా సాటిలేనిదిగా చెప్పొచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో మాత్రమే లభించే ఈ పండు కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. మామిడి పండ్లలో బంగినపల్లి, తోటపురి, ఆల్ఫాన్సో వంటి అనేక రకాలు ఉన్నాయి. పచ్చి మామిడికాయలతో పచ్చళ్లు, పప్పు, పానీయాలు తయారు చేస్తారు.

అంతే కాకుండా మామిడి పండులో విటమిన్-ఎ, విటమిన్-సి సమృద్ధిగా ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీని అద్భుతమైన తీపి వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. మరీ ముఖ్యంగా మామిడి చెట్టు ఆకులను శుభకార్యాల్లో తోరణాలుగా కట్టడం మన సంప్రదాయంగా వస్తుంది. అందుకే కేవలం రుచిలోనే కాకుండా, భారతీయ సంస్కృతిలో కూడా మామిడికి విశిష్ట స్థానం ఉంది.

mango-arrived-three-months-early-into-fruit-markets-at-hyderabad

సాధారణంగా వేసవి ప్రారంభంలో ముఖ్యంగా ఏప్రిల్ నెలలో మామిడిపండ్లు మార్కెట్లోకి వస్తాయి. కానీ ఈసారి ఆశ్చర్యకరంగా మూడు నెలల ముందే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ, ఎంజే మార్కెట్, గడ్డి అన్నారం వంటి ప్రధాన పండ్ల మార్కెట్లలో ఇప్పటికే మామిడిపండ్లు అమ్మకానికి వచ్చాయి. ముఖ్యంగా ప్రజలకు ఎంతో ఇష్టమైన బంగినపల్లి మామిడి ప్రస్తుతం కిలోకు రూ.180 నుంచి రూ.200 వరకు ధర పలుకుతోంది.

అయితే వీటి ధర ఎక్కువగా ఉండటంతో పాటు, రుచి అంతగా లేదని వినియోగదారులు చెబుతున్నారు. మామిడిలో ఉండే సహజమైన తీపి, వాసన ఇప్పటి పండ్లలో కనిపించకపోవడంతో చాలా మంది కొనుగోలుదారులు వెనుకడుగు వేస్తున్నారని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. కొన్ని పండ్లు చప్పగా, కొంచెం పుల్లగా ఉండటంతో పాటు, పూర్తిగా సహజంగా పండిన మామిడి రుచి అందడం లేదని అంటున్నారు.

mango-arrived-three-months-early-into-fruit-markets-at-hyderabad

ముందస్తు మామిడికి కారణాలు ఇవే..

అయితే వ్యాపారులు, వ్యవసాయ నిపుణుల ప్రకారం ఈసారి మామిడి ముందుగానే మార్కెట్లోకి రావడానికి పలు కారణాలు చెబుతున్నారు. వాటిలో

  • హైబ్రిడ్ మామిడి సాగు విధానాలు పెరగడం
  • వాతావరణ మార్పులు
  • శీతాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం
  • అకాల వర్షాలు పడటం

రైతులు, వ్యాపారుల ఆందోళన..

మరోవైపు, ముందస్తుగా పండ్లు రావడం వల్ల రైతులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాధారణ సీజన్‌కు ముందు మార్కెట్‌లోకి వస్తే డిమాండ్ తక్కువగా ఉండటం, ధరలు నిలకడగా లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా సీజన్ మామిడి వచ్చిన తర్వాత ధరలు భారీగా పడిపోతాయేమోనన్న భయం నెలకొందని వాపోతున్నారు. ఈ ముందస్తు మామిడిని ఎక్కువగా తినకుండా, సహజ సీజన్‌లో వచ్చే మామిడిని కొనుగోలు చేయడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+