ఎంట్రీ నహీ హై భయ్యా: హైదరాబాద్‌లో దారుణం: చైనీయులను పోలిన ముఖం: సూపర్ మార్కెట్లోకి నో ఎంట్రీ. !
హైదరాబాద్: మనదేశంలో మినీ ఇండియాగా గుర్తింపు తెచ్చుకున్న ఏకైక నగరం.. హైదరాబాద్. దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు మన భాగ్యనగరంలో నివసిస్తున్నారు. వలస కార్మికుల సంఖ్యా ఎక్కువే. జీవనోపాధి కోసమో, ఉన్నత విద్య అవసరాల కోసమో దేశం నలుమూలల నుంచీ హైదరాబాద్‌కు వస్తుంటారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో జంటనగరాల్లో నివసిస్తున్నారు. వారందరినీ సాటి సోదరులుగా గౌరవిస్తుంటారు హైదరాబాదీయులు.

కొత్త ముఖాలను చూస్తే ఉలికిపాటు..
కరోనా వైరస్ విస్తరించిన ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ముఖాలను చూసి, ఉలిక్కిపడుతున్నారు హైదరాబాదీయులు. వివక్షను చూపుతున్నారు. వారిని దూరంగా ఉంచుతున్నారు. ఇదివరకు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్టు పట్ల కొందరు స్థానికులు అమానవీయంగా ప్రవర్తించారు. కరోనా వైరస్ అని సంబోధిస్తూ అవహేళనకు గురి చేశారు. తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి హైదరాబాద్‌లోనే చోటు చేసుకుంది.

మణిపూర్ యువకులకు చేదు అనుభవం..
జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మణిపూర్ యువకులకు చేదు అనుభవం ఎదురైంది. వారి ముఖం చైనీయులను పోలి ఉండటం వల్ల విదేశీయులుగా భావిస్తున్నారు. మణిపూర్ నుంచి వచ్చిన ఆ యువకులు కొంతకాలంగా వనస్థలిపురంలో నివసిస్తున్నారు. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి వనస్థలిపురం సమీపంలోని ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లగా.. వారిని లోనికి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు సెక్యూరిటీ గార్డులు.

భారతీయులమని చెప్పుకోవాల్సిన దుస్థితి..
లోనికి వెళ్లడానికి అనుమతి లేదని ఎంట్రన్స్‌లోని నిలిపివేశారు. తాము భారతీయులమేనని చెప్పుకోవాల్సిన దుస్థితిని వారు ఎదుర్కొన్నారు. తాము మణిపూర్ వాసులమని, చాలాకాలంగా వనస్థలిపురంలో నివసిస్తున్నామని చెప్పుకొన్నప్పటికీ కనికరించలేదు సెక్యూరిటీ గార్డులు. వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా వారిద్దరూ హైదరాబాద్ చిరునామా ఉన్న ఆధార్ కార్డులను చూపించినప్పటికీ పట్టించుకోలేదు. తమ మేనేజర్‌తో మాట్లాడిన తరువాతే అనుమతి ఇస్తామని, అప్పటిదాకా ఇక్కడ నిల్చోవద్దంటూ హూంకరించారు.

తెలుగులో మాట్లాడితేనే సమాధానం..
ఎంట్రీ నహీ హై భయ్యా.. అంటూ వెనక్కి తిప్పి పంపించారు. తనకు హిందీ తెలియదని, తెలుగులో మాట్లాడాలని సెక్యూరిటీ గార్డు వారిని సూచించారు. తెలుగులో మాట్లాడితేనే తాను సమాధానమిస్తానని చెప్పారు. భారతీయులందరికీ తెలుగు ఎక్కడి నుంచి వస్తుందని ఆ మణిపూర్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన పట్ల రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications