• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అక్కడో కోయవాడ: నమ్మించి బురిడీ, ఎమ్మెల్యే కూతురు ఇలాగే...

|

వరంగల్‌ : శాస్త్ర సాంకేతిక రంగాు ఎంత అభివృద్ధి చెందినప్పటికీ మనిషి మూఢనమ్మకా వలయంలో చిక్కుకుపోతున్నాడు. సమాజానికి దిశా నిర్దేశం చేసే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సైతం మూఢ నమ్మకాలకు బానిసలవుతున్నారు. బాబాలు, స్వాముల పేరుతో చెలామణి అవుతున్నవారిని ఆశ్రయిస్తున్నారు. వారి ఆనతి మేరకు అడుగు కదుపుతున్నారు.

విషయం బయటకు పొక్కకుండా అనేక జాగ్రత్తు తీసుకుంటున్నారు. ఇదే అవకాశంగా బాబాలు చెరేగిపోతుండగా, పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, ఇతర సంపన్నవర్గాలు వారి చేతివాటానికి బలవుతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకుంటున్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా ఉంటున్నారు.

మెజారిటీ ప్రజాప్రతినిధులు

వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ తోట ప్రాంతంలో కోయవాడ ఉంది. సహజంగానే రామచిలుకలతో ఊరంతా తిరుగుతూ జ్యోతిష్యం చెబుతుంటారు. ఇందులో రాజకీయ అవగాహన మెండుగా ఉన్న కొందరు కోయదొరలు ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుంటారు.

Many in the net of fake babas in Waranagal

వారి అనుచరులు, ఆత్మీయుల ద్వారా సమస్యను తెలుసుకొని వాటికి పరిష్కారం తమ వద్ద ఉందని నమ్మబుకుతారు. దీంతో ఆశకుపోయిన నాయకులు వేల రూపాయలు సమర్పించుకుంటారు. కీడు పోగొట్టేందుకు, నరదృష్టి లేకుండా చేసేందుకు తమవద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉన్నాయని నమ్మిస్తారు. ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో... కోయదొర మంత్రశక్తి వ్ల తమకు మంచి జరగకపోతుందా అన్న ఆలోచనతో వీరు చెప్పినట్టే వింటారు. వారు అడిగిన డబ్బును సమర్పించుకుంటారు.

కోయదొర వలలో చిక్కి ఏకంగా రూ. 57 లక్షలు పోగొట్టుకున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూతురు సంఘటన ఇదే నేపథ్యంలో జరిగినట్లు తెలుస్తోంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేతో దిగిన తమ ఫొటోలను చూపిస్తూ ఇదిగో ఫలానా నాయకుడు ఈయనకు ఈ సమస్య ఉండేది.. ఆ సమస్యను తామే పరిష్కరించామని, మరో మంత్రికి వచ్చిన పెద్ద ఆపదను తామే తప్పించామని, అందుకు సాక్ష్యంగా అతనితో దిగిన ఫొటోలు చూపించి నమ్మబలికినట్టు తెలుస్తోంది. ఇదే విధంగా జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధుల నుంచి కూడా పూజలు చేసి కీడు తొలగించే పేరుతో వేలాది రూపాయు వసూలు చేసినట్లు తొస్తోంది.

ఇల్లు పీకి పందిరేసిన నేత...

నగరానికి చెందిన అధికార పార్టీ సీనియర్‌ నాయకుడు వాస్తు పిచ్చితో కట్టుకున్న ఇంటిని పీకి పందిరేసినంత పని చేశాడు. వాస్తు నిపుణుల పేరుతో చలామణి అయ్యే కొందరు నకిలీలు ఆయనకు మెట్లు తీయమని, ఇలా చేస్తే రాజకీయ భవిష్యత్‌ ఉజ్వలంగా ఉంటుందని ఊదరగొట్టారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు ఎంత చెప్పినా వినకుండా ఇంటిని కూల్చడమే పనిగా పెట్టుకున్నాడు. దీంతో రాజకీయ భవిష్యత్‌ ఏమో కాని అప్పు మాత్రం భారీ మిగిలాయి.

ముహూర్తం చూడనిదే...

హన్మకొండకు చెందిన మరో నాయకుడు ప్రజలను కలవాలన్నా, కారులో కూర్చోవాలన్నా... శుభ కార్యనికి వెళ్లాలన్నా ముహూర్తం అనుకూలిస్తే తప్ప బయటకు అడుగు పెట్టడని అంటారు. ఇటీవల ఆయనకు ఆత్యున్నత పదవి లభించింది. ఎంతటి ముఖ్యమైన కార్యక్రమం అయినప్పటికీ ముహూర్తం అనుకూలించకపోతే హాజరయ్యే ప్రసక్తిలేదు.

బురిడీ బాబా వలలో..

జనం అవసరాలు, కోర్కెలు, బలహీనతలే క్ష్యంగా ఈ బాబాలు అందినంత దోచుకుంటున్నారు. విద్యాధికుల్లో సైతం శాస్త్రీయ దృక్పథం కొరవడుతోంది. వర్థమాన రాజకీయ నాయకులు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు, ఉన్నతాధికారులు వీరి వలలో చిక్కుకున్న వారేనని తెలుస్తోంది. ఇక మామూలు జనం అయితే అనేక రూపాల్లో మోసపోతూనే ఉన్నారు. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూసే దంపతులు అనేక రకా బాబా మోసాలకు బలవుతున్నారు. కొందరు నాటు వైద్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటే.. మరొకొందరు దొంగ బాబాను నమ్మి లైంగిక వేధింపులకు గురైన సంఘటనలు లేకపోలేదు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Manypoliticians and prominent persons bcoming prey for fake babas in Warangal city of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more