హైదరాబాద్– విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్..!
హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. క్రిస్మస్ సెలవులు ముగిసిన నేపథ్యంలో హాలీడేస్ కు వెళ్లినవాళ్లు తిరుగు ప్రయాణం నేపథ్యంలో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరినట్లు సమాచారం అందుతోంది. క్రిస్మస్ పండగ, వీకెండ్ కలిసిరావడంతో నగర వాసులు సొంతూళ్లకు వెళ్లారు. వాళ్లు తిరిగి సిటీకు వస్తున్న నేపథ్యంలో వాహనాల రద్దీ నెలకొన్నట్లు తెలుస్తోంది.
NH- 65.. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరినట్లు తెలుస్తోంది. అటు చిట్యాల, చౌటుప్పల్, నార్కట్ పల్లి ప్రాంతాల వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ట్రాఫిక్ రద్దీని సమీక్షించి.. పరిస్థితిని చక్కదిద్దేందుకు ట్రాఫిక్ పోలీసులు, NHAI సిబ్బంది రంగంలోకి దిగారు. అదనపు టోల్ గేట్లు తెరిచి వాహనాలను వేగంగా పంపే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఓ వైపు వాహనాల రద్దీ పెరుగుతోంది.. అలాగే రోడ్డు విస్తరణ పనులు, టోల్ చెల్లింపులు ఆలస్యం కావడం వల్ల ట్రాఫిక్ మెల్లగా కదులుతోంది. NH- 65 పైన ముఖ్యంగా సూర్యాపేట జిల్లా, కేతెపల్లి మండలంలోని కొర్లపహడ్ టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొన్నట్లు స్పష్టం అవుతోంది. అలాగే పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఎన్ హెచ్ ఏఐ అధికారులు.. ట్రాఫిక్ కు క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications