మేడారం హూండీల లెక్కింపు.. మూడు రోజుల్లో రూ.8.06 కోట్ల ఆదాయం

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహా జాతర ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఇక హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. కానుకల హూండీల లెక్కింపు మూడో రోజు పూర్తయింది. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో కొనసాగుతోంది. దేవాదాయ శాఖ అధికారులు, సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగింది.

జాతరకు సంబంధించి మొత్తం 828 హూండీలు ఏర్పాటు చేశారు. అయితే ఇందులో 780 ఇనుప హూండీలు, 45 వస్త్ర హూండీలు, 3 బియ్యం హూండీలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మూడో రోజు 140 హూండీలను తెరిచి లెక్కించగా.. వాటి ద్వారా రూ. 2,01,21,440/- ఆదాయం లభించింది. అదనంగా విదేశీ కరెన్సీ మార్పిడి ద్వారా రూ. 71,283/- ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఇంతకుముందు ఫిబ్రవరి 5 న 125 హూండీల లెక్కింపులో రూ. 2,49,65,000/- ఆదాయం సమకూరగా.. ఫిబ్రవరి 6న 160 హూండీల లెక్కింపులో రూ.3,54,25,200/తో పాటుగా విదేశీ కరెన్సీ మార్పిడి ద్వారా రూ.63,436/ ఆదాయం లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక మూడు రోజుల వ్యవధిలో మొత్తం 425 హూండీలను లెక్కించగా మొత్తం కలిపి రూ.8,06,46,359/- ఆదాయం సమకూరినట్లు స్పష్టం చేశారు.

మూడో రోజు లెక్కించిన నగదులో నుంచి రూ. 2,01,92,723/- మొత్తాన్ని పర్యవేక్షణ అధికారుల సమక్షంలో బ్యాంకు అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. బంగారం, వెండి కానుకలను వేర్వేరుగా ఇనుప హూండీలలో భద్రపరిచి సురక్షితంగా ఉంచినట్లు పేర్కొన్నారు. నాణేల లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదని వెల్లడించారు.

Medaram hundi collection Medaram jatara 8 06 Crore Collected in 3 Days from Devotee Offerings

ఇక మేడారం జాతర హుండీల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో 33 శాతం వాటాను పూజారులకు అందిస్తారు. గత జాతరలో సుమారు రూ. 13 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఈసారి దాని కంటే 3 రెట్లు అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మొత్తం లెక్కింపుకు దాదాపు 10 రోజులకు పైనే సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది లెక్కింపు పూర్తయ్యాకే మొత్తం ఆదాయం ఎంత వచ్చిందో అధికారికంగా ప్రకటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+