Medaram jatara: నేడు మేడారం జాతరలో తుదిఘట్టం: సమ్మక్క సారలమ్మల వనప్రవేశం!!
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఆసియా ఖండంలోనే పెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం జాతర వనదేవతలను గౌరవించే అపురూపమైన జాతర . ఒకప్పుడు గిరిజనులు మాత్రమే జరుపుకునే ఈ జాతర ఇప్పుడు ప్రజలందరూ విశేషంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మేడారం జాతరలో చివరి రోజు నేడు తుది ఘట్టంతో మేడారం జాతర ముగియనుంది.
మేడారంలో రెండేళ్ళ కోసారి జరిగే జాతరలో మేడారం గద్దెల పైన కొలువైన అమ్మవార్లు ప్రస్తుతం భక్తులకు దర్శనమిస్తున్నారు. నిన్న ఒక్కరోజే 50 లక్షల మంది భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు అంటే ఆ తల్లుల మహత్యం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక నేడు సమ్మక్క సారలమ్మ జాతరలో తుది అంకం జరగనుంది.

నాలుగురోజుల మహాజాతరలో భాగంగా తొలిరోజు పగిడిద్దరాజు, గోవిందరాజులు, జంపన్న మేడారం గద్దెలపైకి రాగా, ఆ తర్వాత రోజు సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం తీసుకువచ్చారు. ఇక మాఘశుద్ధ పౌర్ణమి నాడు చిలకలగుట్టపై కుంకుమభరణి రూపంలో ఉన్న సమ్మక్కను, సమ్మక్క పూజారులు గద్దెలపైన ప్రతిష్టించారు. సమ్మక్క రాకతో మేడారం జాతర ఊపందుకుంది. ఇసుకేస్తే రాలనంత మంది జనంతో వనమంతా నిండిపోయింది. కోట్లాది సంఖ్యలో భక్తులు మేడారం జాతరకు రావడంతో మేడారం జనసంద్రమైంది.
ఇక నేడు జాతరలో చివరి ఘట్టమైన అమ్మవార్లు వన ప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది. ఇప్పటికే సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న భక్తులు మేడారం నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఇంటికి తిరుగుముఖం పట్టడంతో మేడారం తాడ్వాయి రోడ్డుపైన వాహనాల రద్దీ నెలకొంది. దీంతో ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తుతుంది. ఇక నేడు కూడా మేడారం జాతరలో అమ్మవార్లను దర్శించుకోవడానికి వెళ్లేవారి సంఖ్య భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఒకవైపు మేడారం నుంచి వస్తున్న వాహనాల రద్దీ, మరోవైపు మేడారానికి వెళుతున్న వాహనాల రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా మేడారం జాతర నేటితో ముగియనున్న క్రమంలో మళ్లీ రెండేళ్లకు వచ్చే మేడారం జాతరకు అంతా బాగుంటే వస్తామని ఆ తల్లులకు నివేదించుకుని, మొక్కులు చెల్లించుకుని అమ్మలను దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణం అవుతున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications