వనంలో నుండి జనంలోకి తల్లి సమ్మక్క ఆగమనం, భక్తి తన్మయత్వంలో మేడారం!

మేడారం మహా జాతరలో ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూసిన మహాఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవత సమ్మక్క తల్లి వనం విడిచి భక్త జనంలోకి అడుగుపెట్టింది .మేడారం అడవుల్లో కోట్లాదిగా తరలివచ్చిన భక్తులందరూ జయ జయ ధ్వానాలు పలుకుతూ సమ్మక్కకు స్వాగతం పలికారు. చిలకలగుట్ట పైనుండి సమ్మక్క ను పూజారులు కిందికి తీసుకురాగా సమ్మక్క ఆగమనానికి సూచికగా ఎస్పి సుధీర్ రామ్ నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపి అమ్మ వారికి స్వాగతం పలికారు.

పూనకాలు, తన్మయత్వంతో మేడారం గద్దెలపైకి సమ్మక్క

260 మంది రోప్ పార్టీ సిబ్బందితో మంత్రులు, ఉన్నతాధికారుల అధికార లాంచనాలతో సమ్మక్క గద్దెల మీదికి బయలుదేరిన క్షణం భక్తులలో భావోద్వేగానికి కారణమైంది. రాత్రి ఎనిమిది గంటల 30 నిమిషాలకు సరిగ్గా సమ్మక్క మేడారంలో గద్దెలపైకి చేరుకున్నారు. దారి పొడవున పూనకాలతో తన్మయత్వానికి లోనైన భక్తులు అమ్మవారికి స్వాగతం పలుకుతూ ఆహ్వానించడం ప్రతి ఒక్కరికి ఒళ్ళు గగుర్పాటుకు గురయ్యేలా చేస్తుంది.

medaram jathara sammakka came on to medaram gaddelu afrer sp gun fire jathara reached peaks

భారీ భద్రత మధ్య గద్దెల పైకి సమ్మక్క ఆగమనం

మేడారం జాతరలో సమ్మక్క ఆగమనం ఒక పులకింతలు కలిగిస్తుంది. గద్దెల మీదికి సమ్మక్క రాక ముందు గద్దెలపై కంక వనం ప్రతిష్టించారు. ఆ తర్వాత సమ్మక్క గద్దెలవద్దకు భారీ భద్రత, భక్త జనసందోహం నడుమ చేరుకుంది. కొమ్ము నృత్యాలు, గుస్సాడీ, ధింసా నృత్యాలతో సమ్మక్కను గద్దెల వద్దకు తీసుకువచ్చారు.

అమ్మ రాకతో ప్రశాంతంగా తనమయత్వంతో మేడారం

గద్దెల ప్రాంతానికి చేరుకున్న అమ్మవారికి అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహించి ప్రధాన పూజారి సారయ్య మహా ఘట్టాన్ని పూర్తి చేయగా, మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు పూజలు చేసిన అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఒక్కసారిగా మేడారం అంత జనంలోనూ అమ్మ రాకతో ప్రశాంతంగా మారిపోయింది.

సమ్మక్క ఆగమనంతో ఊపందుకున్న జాతర

అమ్మవారిని గద్దెల మీద ప్రతిష్టించడంతో మేడారం జాతర ఊపందుకుంది. ఈ అపూర్వ దృశ్యాన్ని చూడడం కోసం మేడారానికి కోట్లాదిగా తరలివచ్చిన భక్తజనం అమ్మలకు నీరాజనం పలుకుతారు. దారి పొడవునా శివసత్తుల పూనకాలు, ఎదురు కోళ్ళు, పసుపు కుంకుమ నీళ్లతో అమ్మకు స్వాగతం పలికే దృశ్యాలు జీవితంలో ఒక్కసారైనా చూస్తే చాలు అనిపిస్తుంది. గద్దెల మీదికి అమ్మ రాకతో మేడారం జాతరకు వచ్చిన భక్తులు తన్మయత్వంతో అమ్మలను దర్శించుకుంటారు. రేపు భక్తులకు దర్శనం ఇచ్చి, ఎల్లుండి మళ్ళీ సమ్మక్క, సారలమ్మలు వన ప్రవేశం చేస్తారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+