వనంలోకి ప్రవేశించిన సమ్మక్క- సారలమ్మలు.. ముగిసిన మేడారం జాతర

నాలుగు రోజుల పాటు కన్నుల పండగలా సాగిన మేడారం మహా జాతర ముగిసింది. శనివారం గద్దెల పూజ అనంతరం రాత్రి వన దేవతలు వన ప్రవేశం చేశారు. గిరిజన సంప్రదాయ డప్పు, డోలు వాయిద్యాలతో వనదేవతలైన సమ్మక్క- సారలమ్మలను గద్దెల నుంచి కన్నెపల్లి, చిలకలగూడ ప్రాంతాలకు తీసుకెళ్లారు. అలాగే పూనుగుండ్లకు (మహబూబాబాద్‌) పగిడిద్దరాజును తరలించారు. దీంతో నాలుగు రోజులపాటు అట్టహాసంగా సాగిన మేడారం జాతర ముగిసింది.

మేడారం జాతర చివరి రోజైన శనివారం ఉదయం నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వచ్చారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి అమ్మవార్లను దర్శించుకున్నారు. చివరిరోజు కావడంతో భక్తులతో మేడారం కిటకిటలాడింది. ఇక ఈ నెల 28న వనం నుంచి జనంలోకి వచ్చిన సమ్మక్క- సారలమ్మలు తాజాగా వారివారి స్థానాలకు చేరుకోవడంతో జాతర పూర్తయింది. రేపు ఆదివారం సెలవు దినం కావడంతో రేపు కూడా రద్దీ అధికంగానే కొనసాగే అవకాశం ఉంది.

ఇక మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చింతల గట్టు వట్టి వాగు వద్ద జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు పెద్ద సంఖ్యంలో విచ్చేశారు. దాదాపు 6 లక్షల మంది భక్తులు జాతరకు హాజరు అయి ఉంటారని తెలుస్తోంది. నాలుగు రోజులపాటు జరిగిన ఈ జాతర.. ఆదివాసీ గిరిజన పూజారులు వారి సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించి తిరిగి తల్లులను వనంలోకి చేర్చడంతో పూర్తయింది.

MedaramJathara Concludes in Grandeur Sammakka amp amp Saralamma Return to the Forest Amid Devotee Chants

ఇక ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరిగిన విషయం తెలిసిందే. యాత్రను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మేడారం జాతర ప్రసిద్ధి పొందిన విషయం తెలిసిందే. ఈ మహా జాతరకు కోటి మంది భక్తులు తరలి వస్తారని అధికారుల అంచనా వేసిన నేపథ్యంలో అందుకు తగినట్లుగానే ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జాతర ముగిసేలా పోలీసులు, అధికారులు కృషి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+