వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్భాటం వద్దు!: సత్య నాదెళ్లకు కెటిఆర్ స్వాగతం, హావభావాలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సోమవారం ఉదయం టీ హబ్‌ను సందర్శించారు. టీ హబ్ వద్ద సత్య నాదెళ్లకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఘన స్వాగతం పలికారు. అనంతరం టీ హబ్ విశిష్టత, ఏర్పాట్లపై సత్య నాదెళ్లకు వివరించారు.

అనంతరం కెటిఆర్, జయేష్ రంజన్, స్టార్టప్ కంపెనీలతో సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. దాదాపు పది నిమిషాలు సత్య నాదెళ్ల మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సత్య నాదెళ్ల చెప్పారని తెలుస్తోంది.

కొత్త ఐడియాలతో ముందుకు వస్తే తప్పకుండా తోడ్పాటు అందిస్తామని సత్య నాదెళ్ల అన్నారు. ఐటీలో భారతీయుల నైపుణ్యాలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. భారతీయులు త్వరలోనే ఐటీలో ఆధిపత్యం వహించే స్థాయికి చేరుకుంటారన్నారు.

భారత్‌లో యాక్సిలేటర్లు, స్టార్టప్‌ల అభివృద్ధిలో భాగస్వాములమవుతామన్నారు. టీ హబ్‌తో కలిసి పని చేస్తామని తెలిపారు. విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనపై మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎంవోయూ కుదుర్చుకుంది.

కాగా, సత్య నాదెళ్ల సోమవారం హైదరాబాద్‌ వచ్చారు. సత్య నాదెళ్ల సమక్షంలో టీ హబ్‌లో తెలంగాణ ఐటీ విధానాన్ని ప్రకటిస్తామని గతంలో వెల్లడించారు. అయితే ఆయన ఎలాంటి ఆర్భాటం లేకుండా పర్యటన కొనసాగించాలని భావించారు. దీనికితోడు ఎన్నికలకు సంబంధించిన ఇతరత్రా సాంకేతిక అడ్డంకులు ఉండడంతో ఐటీ విధాన ప్రకటనను వాయిదా వేయాలని తెలంగాణ ఐటీ శాఖ అనుకున్నట్లు ఊహాగాలు వినిపిస్తున్నాయి.

నాలుగు అంశాలపై చర్చించాం: కెటిఆర్

సత్య నాదెళ్లతో నాలుగు అంశాలపై చర్చించినట్లు కెటిఆర్ చెప్పారు. వెనుకబడిన జిల్లాల్లో టెక్నాలజీ అబివృద్ధి, మైక్రోసాఫ్ట్ శిక్షణా కార్యక్రమాలు, మహబూబ్ నగర్ జిల్లాలో శిక్షణా కేంద్రం తదితరాల గురించి మాట్లాడినట్లు చెప్పారు. క్లౌడ్ టెక్నాలజీతో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి చెందుతాయన్నారు. పోచారంలో ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను ఫిబ్రవరిలో ప్రారంభిస్తామని చెప్పారు. స్టార్టప్‌కు సహకారం అందిస్తామని సత్య నాదెళ్ల చెప్పారన్నారు.

సత్య నాదెళ్ల

సత్య నాదెళ్ల

గచ్చిబౌలిలోని టీ హబ్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, ఇతర ప్రతినిధులతో ముచ్చటిస్తున్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.

సత్య నాదెళ్ల

సత్య నాదెళ్ల

గచ్చిబౌలిలోని టీ హబ్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, ఇతర ప్రతినిధులతో ముచ్చటిస్తున్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.

సత్య నాదెళ్ల

సత్య నాదెళ్ల

గచ్చిబౌలిలోని టీ హబ్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు స్వాగతం పలికారు.

సత్య నాదెళ్ల

సత్య నాదెళ్ల

సత్య నాదెళ్ల మాట్లాడుతూ... భారత్‌లో యాక్సిలేటర్లు, స్టార్టప్‌ల అభివృద్ధిలో భాగస్వాములమవుతామన్నారు. టీ హబ్‌తో కలిసి పని చేస్తామన్నారు.

సత్య నాదెళ్ల

సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సోమవారం ఉదయం టి హబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్, స్టార్టర్ కంపెనీలతో మాట్లాడుతూ...

English summary
Microsoft CEO Satya Nadella keeps India tour a low key affair, visits T Hub.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X