Konda Surekha: కేటీఆర్ బలుపు మాటలు తగ్గించుకో.. కొండా సురేఖ హెచ్చరిక..!
తెలంగాణ మహిళ మంత్రి కొండ సురేఖపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు. దీని ఆమె తీవ్రంగా స్పందించారు. తనను అవమానించేలా బీఆర్ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. కేటీఆర్ మహిళలు అంటే గౌరవం లేదన్నారు. మహిళలను కేటీఆర్ పశువులకంటే హీనంగా చూస్తారని చెప్పారు. రెండు రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ దుబ్బాకలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేనేత సమస్యలు చెప్పి.. చేనేత కార్మికులు చేసిన మాలను మెడలో వేశారు.
దీన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా వారు తీవ్రంగా ట్రోల్ చేశారు. దీంతో మంత్రి కొండ సురేఖ తీవ్ర మానోవేదనకు గురయ్యారు. బీఆర్ఎస్ పార్టీ వారి పోస్టులతో కనీసం అన్నం కూడా తినబుద్ది కావడం లేదని సురేఖ ఆవేదన వ్యక్తం చేసారు. బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కు సంస్కారం లేదని విమర్శించారు. గతంలో ఓ మహిళ తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. ఏదైనా సాయం చేయాలని ఓ పేద మహిళ కేటీఆర్ కు విజ్ఞప్తి చేస్తే.. సమాజం కోసం కన్నావా అని అన్నారని ఆమె గుర్తు చేశారు.

కేటీఆర్ బలుపు మాటలు తగ్గించుకోవాలని సురేఖ హితవు పలికారు. బీఆర్ఎస్ వారు సోషల్ మీడియాలో మహిళా మంత్రి కించపరుస్తూ చేసిన పోస్టులపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. బీఆర్ఎస్ భన్ ఎదుట కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వీరిని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అక్కడి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. కొండా సురేఖపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు.
మంత్రి కొండా సురేఖను ట్రోల్ చేయడాన్ని ఆయన ఖండించారు. మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరు చెప్పారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications