దేశ ఖ్యాతిని చాటిన రెజ్లర్ల‌కు మీరిచ్చే గౌర‌వం ఇదేనా? మంత్రి కేటీఆర్

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ నిన్న రణరంగంగా మారిన విషయం తెలిసిందే. నెల రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లు నిన్న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పార్లమెంట్లో మహిళా సమ్మాన్ మహా పంచాయత్ నిర్వహించాలని నిర్ణయించారు. కొత్త పార్లమెంట్ భవనం వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రెజ్లర్ల పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ రెజ్లర్ లకు మద్దతు ఇస్తూ పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ రెజ్లర్ ల కు మద్దతుగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

Minister KTR slams Is this the respect you give to wrestlers who have made the country famous?

రెజ్లర్ లపై ఢిల్లీ పోలీసుల తీరును ఆయన ఖండించారు. అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని చాటిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. దేశ ప్రజలంతా రెజ్లర్ లను ఆదుకోవాలని, వారికి మద్దతుగా నిలవాలని, వారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నిన్న ఢిల్లీలో రెజ్లర్ ల పై ఢిల్లీ పోలీసుల తీరుకు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కేటీఆర్.

ఇదేనా మీరు రెజ్లర్లకు ఇచ్చే గౌరవం అంటూ నిలదీశారు. ఆ వీడియో ద్వారా అందరూ ఆలోచించేలా చేశారు. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీ లో నిన్న పోలీసులకు రెజ్లర్ లకు మధ్య జరిగిన ఘర్షణ పై ఢిల్లీ పోలీస్ కమిషనర్ సుమన్ నల్వా వివరణ ఇచ్చారు. రెజ్లర్లు చట్టాన్ని అతిక్రమించారని, ఎంత చెప్పినా వినకుండా వారి ప్రవర్తన ఉందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.

అందుకే వారి సిట్ ఇన్ ప్రొటెక్షన్ ను ముగించాము అన్నారు. భవిష్యత్తులో మరోమారు నిరసన తెలపడానికి అప్లికేషన్ పెట్టుకుంటే వారికి జంతర్ మంతర్ వద్ద కాకుండా వేరే అనుకూలంగా ఉండే ప్రదేశాన్ని కేటాయించడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ సుమన్ నల్వా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+