డీజే టిల్లు సాంగ్ కు స్టెప్పులేసి దుమ్ము రేపిన మంత్రి మల్లారెడ్డి!!

మంత్రి చామకూర మల్లారెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఒక సెన్సేషన్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులలో ఆయన రూటే సపరేటు. ఆయన మాట్లాడినా, స్టెప్పులేసినా సంచలనమే. ఏ కార్యక్రమం అయినా సరే మంత్రి మల్లారెడ్డిని చూస్తేనే జనాలలో ఎక్కడ లేని జోష్ వచ్చి పడుతుంది. ఇక తాజాగా మంత్రి మల్లారెడ్డి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణా రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 2కే రన్, 5కె రన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల చౌరస్తాలో 5కే రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తన డాన్సులతో అందరిలోనూ జోష్ నింపారు. డీజే టిల్లు పాటతో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.

Minister Mallareddy dance to DJ Tillus song!!

డీజే టిల్లు పాటకు విద్యార్థులతో కలిసి మంత్రి మల్లారెడ్డి అదిరిపోయేలా స్టెప్పులేశారు. 5కె రన్ లో విజేతలైన వారికి బహుమతులు ప్రధానం చేసిన మంత్రి మల్లారెడ్డి విజేతలకు ట్రోఫీలను పట్టుకొని డాన్స్ వేసి సందడి చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు స్టేజీపై డాన్సులు వేస్తూ ఉంటే మంత్రి మల్లారెడ్డి కూడా వారిని ఉత్సాహపరిచే ప్రయత్నాల్లో భాగంగా స్టేజి ఎక్కి స్టెప్పులేశారు.

ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి స్టెప్స్ హైలెట్ గా నిలిచాయి. ప్రస్తుతం మంత్రి మల్లారెడ్డి డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 70 ఏళ్ల వయసులో కూడా మంత్రి మల్లారెడ్డి లో ఏ మాత్రం ఉత్సాహం తగ్గకుండా యువకుడిలా జోష్ తో చిందులు వేశారు. ఎవరేమనుకున్నా తాను చేయాలనుకున్నది చేసిన మంత్రి మల్లారెడ్డి డాన్సుల హడావిడి ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తుంది.

మల్లారెడ్డి స్టెప్పులు చూసిన నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. మల్లన్న ఎక్కడుంటే అక్కడ సందడి ఉంటుందని అంటున్నారు. అంతేకాదు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. మేడిపల్లి లో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ కలెక్టర్ అమేయ్ కుమార్ ,కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేంద్ర సింగ్ చౌహన్ లు తెలంగాణ రన్ లో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+