పాల డబ్బాల స్కూటర్ పై మాజీమంత్రి మల్లారెడ్డి షాకింగ్ పని.. వీడియో వైరల్!
మాజీ మంత్రి మల్లారెడ్డి ఏం చేసినా సంచలనమే. ఆయన ఏం మాట్లాడినా విస్ఫోటనమే.. ఆయన జీవితం పైన ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోని జనాలకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. పాలమ్మినా..పూలమ్మినా.. అంటూ ఆయన జీవితం గురించి ఆయన చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక అటువంటి మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు హల్చల్ చేయడమే కాదు ఇప్పుడు అధికారంలో లేని సమయంలో కూడా హల్చల్ చేస్తున్నారు.
పాలబండిపై మల్లారెడ్డి సందడి
తనదైన శైలిలో ప్రజలలోకి వెళుతూ దూసుకుపోతున్నారు. తాజాగా మళ్లీ మాజీ మంత్రి మల్లారెడ్డి పాల బండి పైన కనిపించారు. ఈరోజు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో ఒక కార్యక్రమానికి వెళ్లిన మల్లారెడ్డి అక్కడ సందడి చేశారు. పాల డబ్బాతో కనిపించిన ఒక స్కూటర్ ను చూసిన ఆయన చటుకున స్కూటర్ పైన ఎక్కి కూర్చున్నారు. ఇక ఆ పాల బండిని చూసి తాను పాలు అమ్మిన రోజులను మాజీ మంత్రి మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు.

ఫోటోలకు ఫోజులిచ్చిన మల్లారెడ్డి
ఇక పాల బండి పైన ఫోటోలకు చకచకా ఫోజులిస్తూ సందడి చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. పాల బండి ఎక్కి చేసిన సందడి కి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒకప్పుడు తాను కూడా స్కూటర్ పైనే పాల వ్యాపారం చేసే వాడిని అని గుర్తు చేసుకున్న మల్లారెడ్డి మళ్లీ మరోమారు పాల బండి పై పాలు అమ్ముతూ సందడి చేశారు.
స్కూటర్ పై పాలు అమ్ముతూ సందడి చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) February 16, 2025
మేడ్చల్ జిల్లా - బోడుప్పల్లో స్కూటర్ పై పాలు అమ్ముతు సందడి చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆయన అక్కడ తనకు పాల డబ్బాతో కనిపించిన స్కూటర్ పై ఎక్కి కూర్చొని.. ఒకప్పుడు తాను కూడా స్కూటర్ పైనే పాల… pic.twitter.com/1oflx6oiMf
సోషల్ మీడియాలో పాలబండిపై మల్లారెడ్డి వీడియో వైరల్
ప్రస్తుతం మంత్రి మల్లారెడ్డి పాల బండి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక పాలు అమ్మే వ్యక్తిని శాలువాతో సత్కరించిన మల్లారెడ్డి కష్టపడి పైకి రావాలని తన అభిమతాన్ని తన చర్యల ద్వారా తెలియజేశారు. గతంలో మల్లారెడ్డి స్కూటర్ పై పాలమ్మే స్థాయి నుంచి ఎన్నో విద్యాసంస్థలు, వ్యాపారాలతో ఉన్నత స్థాయికి చేరుకున్నానని తనదైన శైలిలో డైలాగ్స్ చెప్పారు.
సరదా మనిషి మాజీమంత్రి మల్లారెడ్డి
పాలమ్మినా.. పూలమ్మిన అంటూ మల్లారెడ్డి అప్పుడు తనదైన శైలిలో చెప్పిన డైలాగ్ ఇప్పటికీ చాలామందికి గుర్తుండిపోయింది. ఇక అధికారంలో ఉన్నప్పుడే కాదు అధికారంలో లేనప్పుడు కూడా సరదా మనిషి అయిన మల్లారెడ్డి ఎక్కడికి వెళ్ళినా తనదైన శైలిలో హల్చల్ చేస్తూ కనిపిస్తూ ఉండడం గమనార్హం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications