హైద్రాబాద్ లో అదృశ్యమైన ఐదుగురు విధ్యార్థులు విశాఖలో ప్రత్యక్షం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైదరాబాద్ లోని అంబర్ పేటలోని అదృశ్యమైన విధ్యార్థులు విశాఖ పట్టణంలో లభ్యమైంది. విధ్యార్థులు అదృశ్యమైన తల్లిదండ్రుల నుండి ఫిర్యాదులు అందిన వెంటనే కొన్ని గంటల్లోనే పోలీసులు విధ్యార్థుల ఆచూకీని కనుగొన్నారు.

హైద్రాబాద్ అంబర్ పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఐాదుగురు విధ్యార్థినులు గురువారం నాడు అదృశ్యమయ్యారు. పుట్టిన రోజు ఫంక్షన్ అంటూ విధ్యార్థులు అదృశ్యమయ్యారు.

అంబర్ పేటలోని బాపునగర్ లోని ప్రగతి విద్యానికేతన్ పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్న ఐదుగురు విధ్యార్థినుల ఆచూకీ విశాఖపట్నంలో దొరికింది.

missing students identified by police in visakapatnam

అయితే ఎంతకీ విధ్యార్థినులు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు విశాఖలో విధ్యార్థినులను గుర్తించారు. విశాఖ జూ పార్క్ వద్ద విధ్యార్థినులు ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు.

వారిని ఆరిలోవా పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాలికలను హైద్రాబాద్ కు తరలిస్తున్నారు.అయితే విధ్యార్థులు విశాఖకు ఎలా చేరుకొన్నారనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
missing students identified by police in visakapatnam. five pragati school students disappered from school on thursday.
Please Wait while comments are loading...