పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు.. స్పందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ల పై ఈరోజు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ లపై విచారణ జరిపిన ధర్మాసనం నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది.

నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశం
బీఆర్ఎస్ పార్టీ నుండి పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, శ్రీహరి ల పైన అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ లపై హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని డెడ్లైన్ విధించిన హైకోర్టు నిర్ణయం తీసుకోకపోతే ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఇదే క్రమంలో ఈ కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

MLA Kadiyam Srihari reacted to the High Court s verdict on the disqualification of MLAs who defected from BRS

హైకోర్టు డివిజన్ బెంచ్ కు అప్పీలు చేస్తాం : కడియం శ్రీహరి
అయితే పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు వెలువరించిన తీర్పుపైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. హైకోర్టు తీర్పు మీడియా ద్వారా తెలిసిందని తానింకా పూర్తి జడ్జిమెంట్ ను చూడలేదని పేర్కొన్న ఆయన ఏది ఏమైనా న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అవసరం అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ కు అప్పీలు చేస్తామన్నారు. పార్టీ పెద్దలతోనూ, న్యాయ నిపుణులతోనూ చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

పార్టీ ఫిరాయింపులకు మూల కారకులు వారే
పార్టీ ఫిరాయింపులపై ఒక్కొక్క కోర్టు ఒక్కో తీర్పును ఇస్తున్నాయని పేర్కొన్న కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుల పైన విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు బిఆర్ఎస్ నేతలే మూలకారకులని ఆయన మండిపడ్డారు.

పెద్ద ఎత్తున ఫిరాయింపులకు పాల్పడిన చరిత్ర బిఆర్ఎస్ ది
హైకోర్టు తీర్పుతో సంబరాలు జరుపుకుంటున్న బిఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. 2014 నుండి 2023 మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఫిరాయింపులకు పాల్పడిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టించింది అహంకారంతో విర్రవీగింది బిఆర్ఎస్ పార్టీ నే అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+