ఓలా క్యాబ్‌లో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే, ఎందుకంటే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ నేత, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఓలా క్యాబ్‌లో వచ్చారు. రామంతపూర్‌లోని తన నివాసం నుంచి పాదయాత్రగా బయలుదేరి, అనంతరం క్యాబ్‌లో అసెంబ్లీకి చేరుకున్నారు.

ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. క్యాబ్ డ్రైవర్లకు న్యాయం చేస్తామంటూ గత అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ఇంతవరకు ఆయన ఆ విషయాన్ని పట్టించుకోలేదన్నారు.

MLA NVSS prabhakar speaks in support of Cab drivers

అందుకే క్యాబ్‌లో వస్తూ క్యాబ్ డ్రైవర్ల సమస్యల గురించి తెలుసుకున్నానని చెప్పారు. క్యాబ్ డ్రైవర్ల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందన్నారు.

క్యాబ్ డ్రైవర్లకు రావాల్సిన కమిషన్లు ఇవ్వకుండా, యాజమాన్యాలు అన్యాయం చేస్తున్నాయని, ప్రశ్నించిన వారిపై పోలీసుల వేధింపులు కూడా ఎక్కువయ్యాయన్నారు. క్యాబ్ డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Uppal MLA and BJP leader NVSS prabhakar speaks in support of Cab drivers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి