సజ్జల వ్యాఖ్యలు సరికాదు.. హరీష్ రావు చెప్పింది వాస్తవం: ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

తెలంగాణా రాష్ట్రంలోని మంత్రులు అనేక విషయాల్లో ఏపీ ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఒక ఉదాహరణ గా చూపించడం పరిపాటిగా కొనసాగుతుంది. గతంలో ఒకమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లను, తెలంగాణ రాష్ట్రంలో రోడ్లను ఒకసారి కంపేర్ చేసుకోవాలని మంత్రి కేటీఆర్ ఏపీలో రోడ్లపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా ఏపీ మంత్రులు ఘాటుగా స్పందించి ఒకసారి కేటీఆర్ ఏపీకి వచ్చి చూడాలని కౌంటర్ వేశారు.

ఇక ఆ మధ్య ఏపీలో కరెంట్ ఎలా ఇస్తున్నారన్న దానిపై మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా మరోమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులపై మంత్రి హరీష్ రావు షాకింగ్ వ్యాఖ్యలు చేయగా, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు రివర్స్ ఎటాక్ చేశారు. ఇక తెలంగాణా నేతలు కూడా దీనిపైన స్పందిస్తున్నారు.

మంత్రి హరీష్ రావు చెప్పింది ముమ్మాటికీ నిజం

మంత్రి హరీష్ రావు చెప్పింది ముమ్మాటికీ నిజం

ఇక తాజాగా ఏపీ మంత్రులు వైసీపీ నేతలు హరీష్ రావు ని టార్గెట్ చేస్తూ ఏపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టిఆర్ఎస్ పార్టీ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్ యూనియన్ సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం తగదని పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి హరీష్ రావు చెప్పింది ముమ్మాటికీ నిజమని పేర్కొన్న ఆయన అందులో ఎటువంటి అవాస్తవాలు లేవని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడిన సందర్భం వేరు అని పేర్కొన్న పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం 73% ఫిట్మెంట్ ఇస్తే పక్క రాష్ట్రంలో 66 శాతం మించి ఫిట్మెంట్ ఇవ్వలేదని పేర్కొన్నారు.

తమపైన అక్కసుతోనే ఏపీ నేతల వ్యాఖ్యలు

తమపైన అక్కసుతోనే ఏపీ నేతల వ్యాఖ్యలు

కేంద్రం విధించిన షరతులకు తలొగ్గి మీటర్లు పెట్టి ఏడు వేల కోట్లు తీసుకున్నప్పటికీ టీచర్ల ఫిట్మెంట్ ఇవ్వలేకపోయారు అని మంత్రి చెప్పారని ఇది వాస్తవమేనని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టుల పైన తెలంగాణ పథకాల పైన అనేకసార్లు కంప్లైంట్ చేసింది అని పేర్కొన్న పెద్ది సుదర్శన్ రెడ్డి, సీఎం కేసీఆర్ హయాంలో విడిపోయిన తర్వాత తాము బాగా అభివృద్ధి చెందుతున్నామని తమపైన ఈర్ష్య ఉండవచ్చని మేము పట్టించుకోలేదని వ్యాఖ్యలు చేశారు.

మంత్రి హరీష్ రావుపై సజ్జల మాట్లాడటం సరికాదు

మంత్రి హరీష్ రావుపై సజ్జల మాట్లాడటం సరికాదు

ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచేలాగా మంత్రి హరీష్ రావు మాట్లాడారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం సరికాదని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వారిని, విషం కక్కిన వారిని మాత్రమే వ్యతిరేకించామని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. తర్వాత అందరం కలిసి బ్రహ్మాండంగా పని చేసుకుంటున్నామని పేర్కొన్న ఆయన మంత్రి హరీష్ రావు ఇతర రాష్ట్రాలపై, ప్రభుత్వ ఉద్యోగులపై ఏనాడు తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని సమాధానమిచ్చారు.

అనవసరపు వ్యాఖ్యలు చెయ్యొద్దు

అనవసరపు వ్యాఖ్యలు చెయ్యొద్దు

అంతేకాదు ఉచిత కరెంట్ అని చెప్పి అధికారంలోకి వచ్చే నేడు వైఎస్ఆర్ ఆశయాలను తుంగలో తొక్కే నిర్ణయాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకుందని పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. నాణ్యమైన కరెంటు ఇస్తామని చెప్పి మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను మోసం చేస్తున్నారని, ప్రచారం కోసం ఆంధ్రప్రదేశ్ నాయకులు తెలంగాణా పైగానీ, టిఆర్ఎస్ పార్టీ పై గానీ, మంత్రి హరీష్ రావు పైన గానీ అనవసర వ్యాఖ్యలు చేయొద్దని పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.

ఏపీలో టీచర్లను లోపలేస్తున్నారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై దుమారం

ఏపీలో టీచర్లను లోపలేస్తున్నారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై దుమారం

ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తుందని, కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం టీచర్లకు ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతోనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రచ్చ కొనసాగుతోంది. టిఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో టీచర్లకు 73% ఫిట్మెంట్ ఇచ్చిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

అయితే రాష్ట్రంలో ప్రస్తుతం కాస్త వేతనాలు ఆలస్యమవుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్న హరీష్ రావుతెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీచర్లు ఏపీ లోని టీచర్ల పరిస్థితి ఒక సారి గమనించాలని తెలిపారు.అంతేకాకుండా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలాకేంద్రం పెట్టిన షరతులు అన్నింటికీ అంగీకరిస్తే ఏటా ఆరు వేల కోట్ల అప్పులు తీసుకుని రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేవారిమనిమంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ లతోపాటు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్ రావు ను టార్గెట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+