ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై రాజాసింగ్ సంచలన ప్రకటన..!!

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదం మరో సారి తెర మీదకు వచ్చింది. పార్టీ అధ్యక్ష ఎన్నిక సమయంలో రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసారు. ఆ తరువాత పార్టీ అధ్యక్షుడు నడ్డా రాజీనామా ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక.. పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్ రాజీనామా చేయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. కాగా.. ఇప్పుడు రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా పైన తేల్చి చెప్పారు. బీజేపీ లోని ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేయగా, పార్టీ ఆమోదించింది. అయితే.. ఇప్పుడు రాజాసింగ్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. తాను బీజేపీ కి దూరం అయ్యేది లేదంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుపై మరో సారి ఫైర్ అయ్యారు. తోలుబొమ్మలా మారి వ్యవహరించవద్దని, సొంత నిర్ణయాలు తీసుకోవాలని సూచన చేయటం పార్టీలో సంచలనంగా మారుతోంది.

MLA rajasingh made sensational comments over by poll for goshamahal

తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా తాను మాత్రం ఎప్పటికీ బీజేపీని అభిమానిస్తూనే ఉంటానని రాజాసింగ్ స్పష్టం చేసారు. తాను మూడో సారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయిన తనకు పార్టీలో సరైన గౌరవం దక్కలేదని పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అక్కసు వెళ్లగక్కారు. కార్యకర్తలుగా పనిచేసే వారికి పదవులు ఇవ్వాలని తాను కోరడం తప్పా అని రాజాసింగ్ ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీ నుంచి తాను పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని, నాయకత్వం పిలిచి మాట్లాడితే రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాలను చెబుతానని రాజాసింగ్ తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కమిటీతో మాత్రం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాదని తేల్చి చెప్పి మరోసారి రాష్ట్ర బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారారు. తెలంగాణలో కొందరు నేతలు బీజేపీని నాశనం చేస్తున్నారని రాజాసింగ్ అన్నారు. పార్టీతో తనకున్న అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరన్నారు.

తనను నాలుగోసారి కూడా గోషా మహల్ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తారని రాజాసింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేసే ప్రసక్తి లేదని రాజాసింగ్ తేల్చి చెప్పారు. ఏం చేస్తారో చేసుకోమని సవాల్ విసిరారు. పార్టీ కోసం కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా లేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. దీంతో.. ఇప్పుడు రాజాసింగ్ పైన పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది రాష్ట్ర పార్టీలో కీలక చర్చగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+