వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రెడ్డికి చెక్... శ్రీధర్‌బాబు కోసం పార్టీ నేతల మంతనాలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అధ్యక్షుని ఎన్నికపై మరో కీలక పరిణామం చేటుచేసుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించి నూతన అధ్యక్షున్ని తీసుకువస్తారనే ప్రచారంతో దీనిపై ఆ పార్టీ వర్గాల్లో రోజుకో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎంపీ రేవంత్ రెడ్డి అధ్యక్ష రేసులో ముందుండగా ఆయనకు దక్కకుండా పార్టీ ఇతర సీనియర్లు పావులు కదుపుతున్నారు. ఈనేపథ్యంలోనే సీనియర్లంతా కలిసి మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేరును అధిష్టానికి పంపించాలనే చర్చ పార్టీ వర్గాల్లో కొనసాగింది.

రేవంత్‌ రెడ్డికి పోటిగా మరో నాయకుడు

రేవంత్‌ రెడ్డికి పోటిగా మరో నాయకుడు

కాంగ్రెస్‌లో గ్రూపు తగదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. పార్టీ అధ్యక్షుడి మార్పు జరుగుతుందన్న హైకమాండ్ సంకేతాలతో ఆ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. అధ్యక్ష పీఠం కోసం గ్రూపులుగా విడిపోయిన నేతలు అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. పార్టీ అధ్యక్షునిగా ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు పార్టీ సీనియర్లు ప్రయత్నం చేస్తున్నారు. టీపీసీసీ రేవంత్‌రెడ్డికి దక్కకుండా మరోపేరును హైకమాండ్‌కు సూచించాలని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు.

ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేరును సూచించిన నేతలు

ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేరును సూచించిన నేతలు

ఈ నేపథ్యంలోనే రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా మరో వర్గానికి దక్కెలా పార్టీ సీనియర్లు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎల్పీలో పార్టీ అధ్యక్ష ఎన్నికపై నేతల మధ్య అసక్తికర చర్చ జరిగింది. శాసనసభపక్ష నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబుతో బాబుతో పాటు మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డిల మధ్య చర్చ కొనసాగింది. పార్టీ అధ్యక్ష ఎన్నికపై పార్టీ హైకమాండ్‌కు ఉమ్మడిగా ఒక పేరును సూచించాలని వారు భావించారు. ఈ సంధర్భంలోనే సైలంట్‌గా పని చేసుకుని పోయో శ్రీధర్‌బాబు పేరును సూచించాలని జగ్గారెడ్డి చెప్పడం ఆసక్తిగా మారింది.

నేను సైతం అంటూ జగ్గారెడ్డి

నేను సైతం అంటూ జగ్గారెడ్డి

అయితే కొద్ది రోజుల క్రితం జగ్గారెడ్డి సైతం పార్టీ అధ్యక్ష స్థానంతో తాను సైతం పోటి చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇందుకోసం హైకమాండ్‌కు తన బయోడేటాను కూడ పంపినట్టు చెప్పారు. వ్యక్తిగతంగా ఢిల్లీ వెళ్లి పార్టీ అధినేత్రీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతోపాటు ఇతర పార్టీ నేతలను కలిసి కొరనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం తాను వచ్చే ఎన్నికల్లో పోటి కూడ చేయనని హామీ ఇచ్చారు. అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే... పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి పునర్‌వైభవం తీసుకువస్తానని చెప్పారు. ఇందుకోసం తన వద్ద ప్రత్యేక ఆయుధం ఉందని చెప్పారు.

సీనియర్లంతా ఒకవైపు... రేవంత్ ఒకవైపు

సీనియర్లంతా ఒకవైపు... రేవంత్ ఒకవైపు

అయితే ఈ పరిణామాలు చూస్తుంటే రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలనే ఆలోచన పార్టీ సీనియర్ నేతల్లో కనిపిస్తోంది. హుజుర్‌నగర్ ఎన్నికల నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి , కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో పాటు జగ్గారెడ్డి మరియు హనుమంతరావులు పార్టీ అభ్యర్థి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి .. ఉత్తమ్ భార్య పద్మావతిరెడ్డిని రంగంలోకి దింపారు. అయితే అభ్యర్థి ఓడిపోయినా... వారి ప్రయత్నాలు మాత్రం రెవంత్ రెడ్డి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలనే తీవ్ర ప్రయత్నాలకు శ్రీకారం చుడుతున్నారు. దీంతో హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి. అయితే ఇప్పటికే ఓసారి తన కుటుంబ సభ్యులతో సహా ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి సోనియా గాంధిని కలిసి వచ్చారు.

English summary
congress party senior leaders want to send mla sridhar babu name as state party president to party high command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X