నీ బతుకేంటో నాకు తెలుసు, భార్యతో తన్నులు తిన్నోడివి: కడియం శ్రీహరిపై రాజయ్య ఘాటువ్యాఖ్యలు
వరంగల్ జిల్లా: కడియం శ్రీహరి విషయంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఏ మాత్రం తగ్గటం లేదు. తాజాగా స్టేషన్ ఘనపూర్ తన అడ్డా అని, అందులో ఎవరినీ అడుగు పెట్టనివ్వనని చెప్పిన తాటికొండ రాజయ్య కడియం శ్రీహరి వల్ల 361 మంది నక్సలైట్లు చనిపోయారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక రాజయ్య వ్యాఖ్యలకు కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు. రాజయ్య చిల్లర చేష్టలు, అవినీతికి సంబంధించిన రికార్డులు అన్నీ తన దగ్గర ఉన్నాయని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఇక ఎమ్మెల్యే రాజయ్య మరోమారు కడియం శ్రీహరిపై విరుచుకుపడ్డారు.

కడియం శ్రీహరి చీకటి జీవితం అప్పటి టీడీపీ నేతలకు తెలుసు
కడియం శ్రీహరి తనపై చేస్తున్న ఆరోపణలను తాను ఖండిస్తున్నా అని పేర్కొన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రాజకీయాల్లోకి రాక ముందు తన ఆస్తులెంత? కడియం శ్రీహరి ఆస్తులెంత ? అంటూ ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్ ను పట్టుకుని హన్మకొండలో బడా బంగ్లా కట్టుకున్నారని, కడియం అవినీతిపై ఖల్ నాయక్ పుస్తకం వచ్చిందని విమర్శలు గుప్పించారు. కడియం శ్రీహరి చీకటి జీవితం గురించి అప్పటి టీడీపీ నేతలను అడిగితే చెప్తారని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు.

భార్యతో దెబ్బలు తిన్న కడియం శ్రీహరి తన గురించి మాట్లాడటం హాస్యాస్పదం
కడియం శ్రీహరి నక్సలైట్లను చంపారని తాను విమర్శించలేదని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. కడియం శ్రీహరి గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని చెప్పానని, పార్టీ అధిష్టానం అన్నీ గమనిస్తుందని తాటికొండ రాజయ్య వెల్లడించారు. కడియం శ్రీహరి బ్రతుకు తనకు తెలుసని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. భార్యతో దెబ్బలు తిన్న కడియం శ్రీహరి తన గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. కడియం శ్రీహరిపై తాను ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చెయ్యలేదని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు.

కడియం శ్రీహరికి దమ్ముంటే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలన్న తాటికొండ రాజయ్య
స్టేషన్ ఘనపూర్ తన అడ్డానే అని మరోమారు తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. కడియం శ్రీహరి చీకటి బాగోతం తనకు తెలుసనీ, పార్టీ ఫండ్ కూడా సొంతానికి వాడేసుకున్న చరిత్ర కడియం శ్రీహరిది అని తాటికొండ రాజయ్య మండిపడ్డారు. నువ్వా నన్ను విమర్శించేది అంటూ తాటికొండ రాజయ్య కడియం శ్రీహరిపై విరుచుకుపడ్డారు . కడియం శ్రీహరికి దమ్ముంటే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలని తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు. ఏ మాత్రం తగ్గకుండా ఒకరిని మించి మరొకరు సవాళ్లు ప్రతి సవాళ్లు చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను హీటెక్కిస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications