ఎమ్మెల్సీ కవితకు కీలకపదవి.. కేసీఆర్ నయా ప్లాన్!

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత మళ్లీ రాజకీయాలలో యాక్టివ్ అవుతున్నారా? తాజాగా అదానీపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి కేంద్రంలోని మోదీ సర్కార్ ను టార్గెట్ చేసిన కవిత, మళ్ళీ చాలాకాలం తర్వాత ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేయడానికి రంగంలోకి దిగుతున్నారా? ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో జైలు జీవితం అనుభవించి వచ్చిన కవిత ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

బీసీ డెడికేషన్ కమిషన్ ను కలవనున్న కవిత
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తీహార్ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన కవిత చాలాకాలంగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి నేతలతో తన నివాసంలో సమావేశమైన కవిత బీసీ జనాభా లెక్కలు తేల్చాలని బీసీ డెడికేషన్ కమిషన్ కు వినతిపత్రం అందించబోతున్నారు.

MLC Kavitha going to active in politics and key post in brs kcr new plan

రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావిస్తున్న కవిత
బతుకమ్మ పండుగ సమయంలోనే రంగంలోకి దిగుతారని భావించిన కవిత అప్పుడు సైలెంట్ అయ్యారు. అదును చూసి మళ్ళీ పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ రాజకీయాలలో యాక్టివ్ కావాలని భావిస్తున్న కవిత ఈ నెల 26వ తేదీన బీసీ డెడికేటెడ్ కమిషన్ ను కలవనున్నారు. బీసీ జనాభా లెక్కలు తేల్చాలని, బీసీ డెడికేషన్ కమిషన్ న్యాయబద్ధంగా కులగణన వివరాలను సేకరించాలని కవిత విజ్ఞప్తి చేయనున్నారు.

కవితకు పార్టీలో కీలక పదవి ఇచ్చే ఆలోచనలోకేసీఆర్
మరోవైపు కేసీఆర్ తెలంగాణ మహిళా అధ్యక్షురాలుగా కవితకు బాధ్యతలు అప్పగించబోతున్నట్లుగా కూడా పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది. గతంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా గుండు సుధారాణి పని చేశారు. గుండు సుధారాణి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత ఆ బాధ్యతలను కేసీఆర్ ఎవరికీ అప్పగించలేదు. చాలా మంది మహిళా నాయకులు ప్రయత్నం చేసినా ఎవరికీ ఇవ్వలేదు.

కేసీఆర్ కవిత రాజకీయ భవిష్యత్తు కోసం ఏం చేయబోతున్నారు?
అయితే ఈ పదవి కవితకు అప్పగించి రాజకీయంగా కవితను బలోపేతం చేయాలని కెసిఆర్ భావిస్తున్నట్లుగా చర్చ నడుస్తోంది. ఈ చర్చ నేపథ్యంలో కేసీఆర్ కవిత రాజకీయ భవిష్యత్తు కోసం ఏం చేయబోతున్నారు? మళ్లీ కవిత రాజకీయాల్లోకి పుంజుకోవడానికి ఎలాంటి అడుగులు వెయ్యబోతుంది? అన్నది ప్రస్తుతం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+