బెయిల్ కోసం ఎమ్మెల్సీ కవిత నయా ప్లాన్..!
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయి తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం చెయ్యని ప్రయత్నాలు ఏమీ లేవు. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్న కవితకు ప్రతిసారి చుక్కెదురు అవుతుంది. కోర్టు కవిత బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ వస్తోంది. మార్చి 15వ తేదీన అరెస్టు అయిన నాటి నుండి కవిత ఇప్పటివరకు తీహారు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న పరిస్థితి ఉంది.
114 రోజులుగా రోజులుగా తీహార్ జైల్లో కవిత
అయితే కవిత బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నా ప్రతిసారి బెయిల్ తిరస్కరిస్తున్న నేపథ్యంలో తాజాగా బెయిల్ కోసం కవిత కొత్త ప్లాన్ చేశారు. ఈసారి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత దాదాపు 114 రోజులుగా రోజులుగా తీహార్ జైల్లో ఉన్నారు.

కవిత డిఫాల్ట్ బెయిల్ పిటీషన్
అయితే కవిత ఈ కేసులో బెయిల్ కోసం మొదట రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టు కవిత బెయిల్ పిటీషన్లను తిరస్కరించగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కూడా ఈడి, సిబిఐ కేసులలో కవితకు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించింది. దీంతో ప్రస్తుతం కవిత డిఫాల్ట్ బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డిఫాల్ట్ బెయిల్ ప్రకారం కవితకు కచ్చితంగా బెయిల్ వస్తుందని ఆమె తరపు న్యాయవాదులు భావిస్తున్నారు.
నిందితులు చట్టబద్ధంగా బెయిల్ పొందే హక్కు
డిఫాల్ట్ బెయిల్ ప్రకారం ఏదైనా కేసులో నిందితుడికి కోర్టు విధించిన రిమాండ్ గడువు ముగిసినా, విచారణ పూర్తి కాకపోతే డిఫాల్ట్ బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవచ్చు. నిందితుడి నేరాన్ని బట్టి కస్టడీ గరిష్ట గడువు ముగిసినా బెయిల్ రాకపోతే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోర్టుకు కోరవచ్చు. కోర్టు విధించిన రిమాండ్ ముగిసిన తర్వాత కూడా పదేపదే రిమాండ్ గడువును పొడిగిస్తూ నిందితుడికి ఇబ్బంది కలుగుతున్న సమయంలో నిందితులు చట్టబద్ధంగా బెయిల్ పొందే హక్కును డిఫాల్ట్ బెయిల్ అంటారు.
డిఫాల్ట్ బెయిల్ ఎలా ఇస్తారంటే
మరణ శిక్ష, యావజ్క్షజీవ ఖాదు, పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసులలో నిందితుడి కస్టడీ గడువు గరిష్టంగా 90 రోజులు ఉంటుంది మిగతా కేసుల్లో గరిష్టంగా కస్టడీ గడువు 60 రోజులు ఉంటుంది. ఈ గడువు పూర్తయిన తర్వాత కూడా విచారణ పూర్తికాకుంటే డిఫాల్ట్ బెయిల్ ద్వారా నిందితుడు తన హక్కును తాను పొందే అవకాశం ఉంటుంది.
కవిత డిఫాల్ట్ బెయిల్ పై ఏం జరుగుతుందో
ఈ క్రమంలోనే కవిత కోసం డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీని ప్రకారం కవితకు కచ్చితంగా బెయిల్ రావాలి. అయితే ఈ బెయిల్ పిటిషన్ విచారణలో కవితకు బెయిల్ రాకుండా ఈ డి,సి బి ఐ కచ్చితంగా అడ్డుకొని తీరుతాయి. ఇక ఈ బెయిల్ పిటిషన్ పైన కోర్టులో ఏం జరగబోతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కవిత కేసులో మొదటి నుంచి ప్రతికూలంగా తీర్పునిస్తున్న రౌస్ అవెన్యూకోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ కవితకు అనుకూలంగా వస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications