మెగాస్టార్‌ తర్వాత ఆ హీరోనే నా ఫేవరెట్‌ - ఎమ్మెల్సీ కవిత..!!

నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన అభిమాన హీరో ఎవరో బయట పెట్టారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఎన్న కవిత తాజాగా సోషల్ మీడియాలో #AskKavitha అంటూ ఫాలోవర్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందులో రాజకీయ అంశాలతో పాటుగా సినిమా రంగానికి సంబంధించి పలు ప్రశ్నలు వచ్చాయి. అందులో భాగంగా తనకు మెగాస్టార్ చిరంజీవి పైన ఎంత అభిమానం ఉందో చాటుకున్నారు. అంతే కాదు ఆ తరువాత తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పేసారు.

సీఎం కేసీఆర్ కుమార్తె..ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. తాజాగా నెటిజన్లతో ముచ్చటించారు. సినిమా..రాజకీయ అంశాలకు సంబంధించి వచ్చిన పలు ప్రశ్నలకు కవిత సమాధానం ఇచ్చారు. అందులో భాగంగా ఒక నెటిజెన్ చిరంజీవి అంశాన్ని ప్రస్తావించారు. చిరంజీవి గురించి ఏమైనా చెప్పాలని కోరారు.

MLC Kavitha Reveals that she is a die hard fan of Chiranjeevi, next Allu Arjun

దీనికి వెంటనే కవిత ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కవిత ఈ ప్రశ్నకు సమాధానం డై హార్డ్ ఫ్యాన్ అని సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం చూసిన మెగాస్టార్ అభిమానులు మరిన్ని సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసారు. దీనికి కొనసాగింపుగా మీ ఫెవరెట్ హీరో ఎవరు అంటూ ప్రశ్నించారు.

తన ఫేవరెట్ హీరో ఎరవని కవిత సమాధానం ఇస్తారో అని నెటిజెన్లు ఆసక్తిగా సమాధానం కోసం వెయిట్ చేసారు. కవిత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మెగాస్టార్‌ చిరంజీవి ఆల్వేస్‌.. నెక్ట్స్ అల్లు అర్జున్.. తగ్గేదేలే' అంటూ జిఫ్‌ ఇమేజ్‌ను షేర్‌ చేశారు. కవిత ఇచ్చిన ఈ సమాధానాలు ఇప్పుడు మెగాస్టార్..ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసాయి.

గతంలోనూ పలు సందర్భాల్లో కవిత తనకు మెగాస్టార్ పైన ఎలాంటి అభిమానం ఉందో చాటుకున్నారు. ఖైదీ నెంబర్ 150కి ముందు తాను చిరంజీవి 150వ సినిమా కోసం వేచి చూస్తున్నానని..ఒక సారి అభిమాని అయ్యాక ఎప్పటికీ అలాగా అభిమానిగా ఉంటానని స్పష్టం చేసారు. అటు కవిత సోదరుడు మంత్రి కేటీఆర్ సైతం మెగా ఫ్యామిలీతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు.

మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో తనకు పవన్ కల్యాణ్ తో సత్సంబంధాలు ఉన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు తెలంగాణలో పవన్ కల్యాణ్ తన పార్టీ నుంచి అభ్యర్దులను బరిలోకి దించుతున్నారు. ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయంలో ఎమ్మెల్సీ కవిత చిరంజీతి - అల్లు అర్జున్ గురించి వ్యక్తం చేసిన అభిప్రాయాలు..అభిమానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+