Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ కేబినెట్ లోకి అజాహరుద్దీన్, ముహూర్తం ఫిక్స్- సడన్ డెసిషన్ వెనుక..!!

అజాహరుద్దీన్ కు జాక్ పాట్ తగిలింది. మంత్రిగా అవకాశం దక్కింది. జూబ్లీహిల్స్ సీటు కోసం చివరి వరకు ప్రయత్నించిన అజార్ కు సీఎం రేవంత్ అనూహ్యంగా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్ కు సీటు కేటాయించారు. అయితే, పార్టీ హైకమాండ్ వద్ద అజాహరుద్దీన్ కు ఇచ్చిన హామీ మేరకు మంత్రిగా కేబినెట్ లోకి తీసుకునేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్.. అక్కడి సమీకరణాల్లో భాగంగానే ఇప్పుడు అజాహరుద్దీన్ కు మంత్రి పదవి ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ నేత అజాహరుద్దీన్ కు మంత్రి పదవి ఖరారైంది. ఈ నెల 31న మంత్రిగా అజాహరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు అధికారిక సమాచారం అందింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీటు కోసం ఢిల్లీ కేంద్రం అజాహరుద్దీన్ చివరి వరకు ప్రయత్నించారు. అయితే, స్థానిక సమీకరణాల్లో భాగంగా బీసీ అభ్యర్ధికి సీటు ఇవ్వాలని రేవంత్ పట్టు బట్టారు. ఎంఐఎం మద్దతు ద్వారా నియోజకవర్గంలో సామాజిక లెక్కలు కలిసి వస్తాయని అధిష్ఠానానికి వివరించారు.

Mohammad Azharuddin is set to join Revanth Reddy s cabinet as a minister - Details Here

దీంతో ఆ సమయంలో అజాహరుద్దీన్ కు గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీని చేసారు. అయినా.. అజాహరుద్దీన్ తనకు ఎమ్మెల్సీ విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయంటూ సుప్రీం కోర్టులో ఇద్దరు ఎమ్మెల్సీల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నేరుగా రాహుల్ ను కోరారు.

దీంతో పాటుగా రేవంత్ ప్రభుత్వంలో మైనార్టీ వర్గానికి మంత్రి పదవి లేకపోవటం పైన జూబ్లీహిల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అదే విధంగా జూబ్లీహిల్స్ లో మైనార్టీ ఓటింగ్ అక్కడ గెలుపు ఓటమలను డిసైడ్ చేయటంలో కీలకంగా మారుతోంది. మారుతున్న లెక్కలతో పాటుగా సర్వే నివేదికల ఆధారంగా రేవంత్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైకమాండ్ సూచన లతో పాటుగా... మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో భాగంగా అజాహరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

దీంతో.. సోమవారం సాయంత్రం సీఎం రేవంత్ తో అజార్ భేటీ అయ్యారు. మంత్రి పదవి పైన చర్చ జరిగింది. దీంతో.. అజాహరుద్దీన్ కు మైనార్టీ సంక్షేమంతో పాటుగా క్రీడల శాఖ అప్పగిస్తారని తెలుస్తోంది. ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి కానుండటంతో ఇక రేవంత్ కేబినెట్ లో మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉంటాయి. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. అజాహరుద్దీన్ జూబ్లీహిల్స్ లో పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+