AARAA Survey: తెలంగాణలో ఆ పార్టీకే పట్టం: కొత్త జోష్: ప్రతిపక్ష పాత్రకే పరిమితం

హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం ముందస్తు ఎన్నికల హడావుడి నెలకొంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సారథ్యంలోని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో- అన్ని పార్టీలూ ఆ దిశగా అడుగులు వేస్తోన్నాయి. పాదయాత్రలు, బహిరంగ సభలతో తీరిక లేకుండా గడుపుతోన్నాయి. అందలం అందుకోవడమే లక్ష్యంగా వ్యూహ, ప్రతివ్యూహాలతో సాగుతున్నాయి.

ముందస్తు వేడిని మరింత రాజేసిన సర్వే..

ముందస్తు వేడిని మరింత రాజేసిన సర్వే..

ఈ పరిణామాల మధ్య తాజాగా ఓ పోల్ సర్వే వెలువడింది. ముందస్తు ఎన్నికల వేడిని మరింత రాజేసేంది. అన్ని పార్టీల దృష్టినీ తనవైపునకు తిప్పుకొంది. ప్రస్తుతం తెలంగాణలో దీనిపైనే డిబేట్ నడుస్తోంది. హాట్ టాపిక్‌గా మారిందీ సర్వే రిపోర్ట్. రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమైంది. ఈ సర్వే రిపోర్ట్‌పై అప్పుడే విమర్శలు, ప్రతి విమర్శలు సైతం మొదలయ్యాయి. దీనితో తెలంగాణలో రాజకీయ వేడి ఇక పీక్స్‌కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆరా సర్వే..

ఆరా సర్వే..

హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ఆరా (AARAA) సంస్థ ఈ సర్వే చేపట్టింది. అన్ని రాష్ట్రాల్లోనూ క్షేత్రస్థాయిలో నెట్‌వర్క్ ఉన్న సంస్థ ఇది. తాజాగా తెలంగాణలో రాజకీయ స్థితిగతులు, పార్టీల బలాబలాలు, ఓటర్ల అభిప్రాయాలపై నిర్వహించిన సర్వే ఇది. 119 నియోజకవర్గాల్లో సర్వే పూర్తి చేసింది. ఈ రిపోర్ట్ ఫలితాలను ఆరా అధినేత మస్తాన్ వెల్లడించారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

అన్ని స్థానాల్లో..

అన్ని స్థానాల్లో..

గత ఏడాది నవంబర్, ఈ సంవత్సరం మార్చి, జులైల్లో మూడు దఫాలుగా ఈ సర్వే నిర్వహించింది. అన్ని రిజర్వుడ్, నాన్ రిజర్వుడ్ స్థానాల్లో సర్వే సాగింది. ఎస్సీ-7, ఎస్టీ-4, అర్బన్-11, రూరల్-18 నియోజకవర్గాల్లో సర్వే చేపట్టిందా సంస్థ. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించింది. దీనికి అనుగుణంగా నివేదికను రూపొందించింది.

పట్టం.. ఆ పార్టీ..

పట్టం.. ఆ పార్టీ..

ఈ సర్వే ప్రకారం- మళ్లీ అధికారంలోకి వచ్చే పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి. టీఆర్ఎస్ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆరా సర్వే అంచనా వేసింది. టీఆర్ఎస్‌కు అత్యధికంగా 38.88 శాతం ఓట్లు పోల్ అవుతాయి. భారతీయ జనతా పార్టీ రెండో స్థానానికి ఎదుగుతుంది. 30.48 శాతం ఓట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవిస్తుంది. ఇక కాంగ్రెస్ మూడోస్థానానికే పరిమితమౌతుంది. హస్తం పార్టీకి 23.71 శాతం ఓట్లు పడతాయి. ఇతర పార్టీలు 6.91 శాతం ఓట్లను సాధిస్తాయి.

కరీంనగర్ కోటపై టీఆర్ఎస్ జెండా..

కరీంనగర్ కోటపై టీఆర్ఎస్ జెండా..

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కూడా టీఆర్ఎస్ హవా వీస్తుందని సర్వే అభిప్రాయపడింది. ఇక్కడ టీఆర్ఎస్- 39.07, బీజేపీ-35.69, కాంగ్రెస్ 18.91, ఇతరులు 6.31 శాతం ఓట్లు సాధిస్తాయి. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్‌‌లో టీఆర్ఎస్- 40.89, బీజేపీ-30.37, కాంగ్రెస్-23.38, ఇతరులు 5.34 శాతం ఓట్లు సాధించగలవు.

హైదరాబాద్‌లోనూ

హైదరాబాద్‌లోనూ

ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ టీఆర్ఎస్ ప్రభంజనం వీస్తుంది. ఈ బెల్ట్‌లో టీఆర్ఎస్ ఓట్ల శాతం అధికం. ఇక్కడ గులాబీ పార్టీకి 40.43 శాతం ఓట్లు పోల్ అవుతాయి. బీజేపీ- 35.32, కాంగ్రెస్- 16.33, ఇతరులకు 7.92 శాతం ఓట్లు పడతాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండల్లో టీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని నిలుపుకొంటుంది. టీఆర్ఎస్- 35.14, బీజేపీ-20.54, కాంగ్రెస్- 36.22, ఇతరులకు 8.10 శాతం ఓట్లు దక్కుతాయి.

ఓట్ల శాతం తగ్గినా..

ఓట్ల శాతం తగ్గినా..

ఈ క్రమంలో టీఆర్ఎస్‌కు పడే ఓట్ల శాతం భారీగా తగ్గుతుందని ఆరా సర్వే అంచనా వేసింది. 2018లో 46.87 శాతం ఓట్లను సాధించిన టీఆర్ఎస్‌.. లోక్‌సభ ఎన్నికల్లో అయిదుశాతం ఓటుబ్యాంకును కోల్పోయింది. 41.71 శాతం ఓట్లను సాధించగలిగింది. ఇప్పుడు ఈ సంఖ్య మరింత తగ్గుతుంది. 38.88 శాతం ఓట్లు దక్కుతాయి. కాంగ్రెస్ కూడా ఓటు బ్యాంక్‌ను కోల్పోనుంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 28.43 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. 2019 లోక్‌సభలో ఈ సంఖ్య పెరిగింది. 29.78గా నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు శాతం ఓట్లను కోల్పోయి 23.71 శాతం ఓట్లను అందుకుంటుందని పేర్కొందీ సర్వే.

87 స్థానాల్లో..

87 స్థానాల్లో..

తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలకు గాను 87 స్థానాల్లో టీఆర్ఎస్‌కు బలమైన అభ్యర్థులు ఉన్నారని సర్వే పేర్కంది. కాంగ్రెస్-53, బీజేపీ-29 చోట్ల గట్టి అభ్యర్థులు ఉన్నట్లు తెలిపింది. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పీఠాన్ని అప్పగించడం వల్ల కార్యకర్తల్లో కొత్త జోష్ కనిపించినప్పటికీ.. ఆయన సారథ్యంలో ఎదుర్కొన్న ఉప ఎన్నికల ఫలితాలు దీన్ని నీరుగార్చినట్లు పేర్కొంది. టీఆర్ఎస్ ఓటుబ్యాంక్ తగ్గడానికి ప్రధాన కారణం- కేసీఆర్ కుటుంబ ఆధిపత్యం పెరిగిందనే అభిప్రాయం ఉన్నట్లు ఆరా మస్తాన్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+