Motorola G35 5G: రూ.9999 కే మోటోరొలా 5జీ స్మార్ట్ ఫోన్..!
మోటోరొలా(Motorola) ఇండియాలో మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. Moto G35 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ.9999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ మోటో జీ 45 లాగా ఉంటుంది. కానీ చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. మోటో జీ35 5జీ మొబైళ్లలో మంచి బడ్జెట్ ఫోన్ గా చెబుతున్నారు. ఈ ఫోన్ తో 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, డ్యూయల్ స్పీకర్‌లు, ATMOS సపోర్ట్ చేస్తోంది. అయితే ఈ ఫోన్ ఒక వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది.
4జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.9,999గా నిర్ణయించారు. ఈ మొబైల్ రిటైల్ స్టోర్లు, మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ లో డిసెంబర్ 16 నుండి కొనుగోలుకు అందుబాటులో రానుంది. మోటరోలా జీ35 5జీ పోన్6.7-అంగుళాల 120Hz FHD+ డిస్‌ప్లేను 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అదనపు రక్షణ కోసం డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2తో తీసుకొచ్చారు. డిస్ప్లే 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ మొబైల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జనరేషన్ 3 ప్రాసెసర్‌తో వచ్చింది.

దIP రేటింగ్‌ను అందించే అత్యంత సరసమైన ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా(బ్యాక్ కెమెరా), 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. కెమెరా సెటప్ నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్‌తో పాటు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగం(ఫ్రంట్ కెమెరా)లో 16MP కెమెరా ఉంది. మోటరోల జీ 35 5జీ ఫోన్ 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందుకుంటుందని కూడా పేర్కొంది. ఫోన్ 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో రానుంది.
మోటరోలా జీ45 5జీలో కూడా ఇలాంటి ఫీచర్లో ఉన్నాయి. ఇందులో 50 ఎంపీ బ్యాక్ కెమెరాతో పాటు 2 ఎంపీ సెకండరీ కెమెరా ఉంది. కానీ జీ3లో 8 ఎంపీ సెకండరీ కెమెరా ఉంది. ప్రంట్ కెమెరా రెండింటిలో 16 ఎంపీ ఉంది.












Click it and Unblock the Notifications