వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణుడి చావు, నా ఓటమికి వంద కారణాలు .. బూర నర్సయ్య సంచలనం

|
Google Oneindia TeluguNews

భువనగిరి : టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణుడి చావుకి వంద కారణాలు ఉన్నట్టు .. తన ఓటమికి కూడా వంద కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో తన ఓటమి ఎంపీ పదవీకే తప్ప .. సేవా స్ఫూర్తికి కాదని స్పష్టంచేశారు. బుధవారం యాదాద్రి భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

కుట్ర కోణం ..
భువనగిరిలో తన ఓటమి కోసం పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు. తనను ఓడించేందుకు విపక్షాలు జట్టు కట్టాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో తనకు గెలిచి ఓడిపోయిన పరిస్థితి కాదని పేర్కొన్నారు. వాస్తవానికి నియోజకవర్గం కోసం తాను అహర్నిసలు పనిచేశానని గుర్తుచేశారు. కానీ దుష్టశక్తులన్నీ ఏకమై .. జట్టుగా కలిసి ఓడించేందుకు పెద్ద కుట్రనే చేశాయని మండిపడ్డారు. వారంతా జట్టుగా ఏర్పడి .. ఓడించారని పేర్కొన్నారు. ఓటమి అనేది కామనే తప్పు పుల్ స్టాప్ కాదని స్పష్టంచేశారు.

mp elections looss hundred reasons : bura narsaiah

సేవలు కంటిన్యూ ..
నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డామని గుర్తుచేశారు. సప్త సముద్రాలు దాటి రోడ్డు రోలర్ వల్ల ఓడిపోయినట్టు తన పరిస్థితి మారిందని కాస్త వైరాగ్యంతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచే పరిస్థితి నుంచి .. ఓడిపోయేవరకు ట్రెండ్ ఎలా మారిందో అర్థం కావడం లేదన్నారు. తనపై సీఎం కేసీఆర్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడంలో విఫలమయ్యానని అంగీకరించారు. ఇకముందు అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడుతానని పేర్కొన్నారు.

పార్టీ కోసం సైనికుడిలా పనిచేస్తానని పేర్కొన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అహర్నిసలు శ్రమిస్తానని తెలిపారు. తాను ఓడిపోయింది ఎంపీ పదవీకే తప్ప .. సేవాస్పూర్తికి కాదని స్పష్టంచేశారు. తన సేవ కార్యక్రమాలు ఎళ్లవేళలా కొనసాగుతాయని స్పష్టంచేశారు. ఓడిపోయినంత మాత్రానా ఆగవని .. నిరంతరం కొనసాగుతాయని తేల్చిచెప్పారు.

English summary
TRS leader and former MP Bura Narsia Gowd made sensational comments. There are a hundred reasons for Karna's death. There are also a hundred reasons for his defeat. His defeat in the election is that the MP is not the duty of the service except for the inspiration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X