బిగ్‌బాస్ నుంచి ప్రత్యేక అనుమతితో ముమైత్: ఎవరికీ కనిపించొద్దనుకుంటే..
నిన్నటి దాకా ఐటమ్ సాంగ్స్‌కు పేరుగాంచిన ముమైత్ ఖాన్ గురువారం ఉదయం సిట్ ఎదుట హాజరు కానున్నారు. డ్రగ్ రాకెట్ కేసులో ఆమెను విచారించనున్నారు.
హైదరాబాద్: నిన్నటి దాకా ఐటమ్ సాంగ్స్‌కు పేరుగాంచిన ముమైత్ ఖాన్ గురువారం ఉదయం సిట్ ఎదుట హాజరు కానున్నారు. డ్రగ్ రాకెట్ కేసులో ఆమెను విచారించనున్నారు.
చదవండి: బయటకొచ్చాక మరింత అందం, సిట్‌నే విచారించినట్లుగా: చార్మీపై వర్మ, వెటకారం

బిగ్ బాస్ ప్రత్యేక అనుమతి
ముమైత్ ఖా బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నారు. సిట్ విచారణ నేపథ్యంలో ఆమె షో నిర్వాహకుల అనుమతితో బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఆమెకు బిగ్ బాస్ నిర్వాహకులు ప్రత్యేకంగా అనుమతి ఇచ్చారు. దీంతో పుణే నుంచి ఆమెె హైదరాబాద్ వచ్చారు.
Recommended Video


ఎవరికీ కనిపించకుండా జర్కిన్ కప్పుకొని
డ్రగ్ రాకెట్‌లో విచారణ కోసం హైదరాబాద్ వచ్చిన ముమైత్ ఖాన్ విమానాశ్రయంలో ఎవరికీ కనిపించకుండా నిండా జర్కిన్ ధరించారు. ముఖాన్ని కూడా కప్పుకున్నారు. తన వెంట ఎవరూ లేకుండా చూసుకున్నారు. కానీ కొందరు మీడియా ప్రతినిధులు ఆమెను గుర్తించి, ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేశారు. ఆమె మౌనంగా వెళ్లిపోయారు.

హాజరవ్వాల్సిందే
డ్రగ్ కేసులో నోటీసులు అందుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లో సిట్ ఎదుట హాజరు కావాల్సిందేనని ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఇప్పటికే తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ముమైత్ ఖాన్ 70 రోజుల బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పటికీ అనుమతి తీసుకొని వచ్చారు.

తప్పలేదు
బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత లోపలి వారు బయటకు, బయటి వారు లోపలకు వెళ్లే అవకాశం లేదు. దీంతో ముమైత్ ఖాన్ ఎలా వస్తారనే చర్చ సాగింది. కానీ ప్రభుత్వ సంస్థల ఆదేశాల నేపథ్యంలో రాక తప్పలేదు. ఈ నెల 27న హాజరవుతానని సిట్‌కు సమాచారం ఇచ్చింది ముమైత్.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications