Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దివ్యాంగ సింగర్ కు తమన్ అవకాశం.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫుల్ ఖుష్!

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరో మారు తన గొప్ప మనసును చాటుకున్నాడు.. ఆర్టీసీ బస్సులో పాట పాడిన దివ్యాంగ సింగర్ కు ఛాన్స్ ఇస్తానని వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఒక యువకుడు కళ్ళు లేకపోయినా అద్భుతమైన పాటతో అందరినీ ఆకట్టుకున్నాడు. అంధుడైనప్పటికీ ఆ యువకుడు పాడిన పాట ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. ఇక ఈ వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దివ్యాంగ సింగర్ విషయంలో స్పందించిన తమన్
మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో అంటూ పేర్కొన్న టిజీఎస్ఆర్టిసి ఎండి విసి సజ్జనార్ ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ఎంఎం కీరవాణి సార్ అంటూ రిక్వెస్ట్ చేశారు. అయితే సజ్జనార్ రిక్వెస్ట్ కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పందించారు. ఆ దివ్యాంగ యువకుడికి తాను పాడడానికి అవకాశం ఇస్తానని పేర్కొన్నారు.

Music director Thaman gave a chance to Divyanga singer TGSRTC MD Sajjanar happy

ఆర్టీసీ బస్సులో అద్భుతంగా పాట పాడిన దివ్యాంగ యువకుడు

దీంతో సామాన్య ప్రజల నుంచి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వరకు ప్రతి ఒక్కరూ తమన్ ను మెచ్చుకుంటున్నారు. హాట్సాఫ్ తమన్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ దివ్యాంగుడైన ఆ యువకుడు శ్రీ ఆంజనేయం సినిమాలో పాటను అద్భుతంగా పాడాడు. పాట పాడడమే కాదు దానికి తన కాళ్లతో, చేతులతో కావలసిన బీట్ ను కూడా సమకూర్చుకుంటూ యువకుడు పాడిన పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

సోషల్ మీడియాలో వైరల్ వీడియో
దివ్యాంగుడైన యువకుడు పాడిన పాటను వీడియో తీసిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. ఆ వైరల్ వీడియో ఆర్టీసీ ఎండి సజ్జనార్ దృష్టికి వెళ్లగా అది చూసిన ఆయన దివ్యాంగ సింగర్ పై ప్రశంసలు కురిపించారు. మట్టిలో మాణిక్యం అంటూ కొనియాడారు. అతనికి అవకాశం ఇవ్వాలని కీరవాణికి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు.

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ ఫోర్ లో అవకాశం
ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఫాన్స్ ఆ వీడియోని పోస్ట్ చేస్తూ తమన్ ని ట్యాగ్ చేశారు.దీనిపై స్పందించిన తమన్ ఆ యువకుడికి అవకాశం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ ఫోర్ లో అతను పాల్గొనేలా చూడాలని ఆహా టీం ను కోరారు. ఆ యువకుడితో కలిసి పెర్ఫార్మ్ చేయడానికి తాను రెడీగా ఉన్నట్టు వెల్లడించారు.

ఆర్టీసీ ఎండి సజ్జనార్ చేసిన ట్వీట్ తో అవకాశం
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ ఫోర్ లో ఆ యువకుడు టాలెంట్ అందరికీ తెలిసేలా అవకాశం కల్పించాలని తమన్ ట్వీట్ లో పేర్కొన్నారు. మొత్తానికి ఆర్టీసీ ఎండి సజ్జనార్ చేసిన ట్వీట్ తో ఓ దివ్యాంగ యువ సింగర్ కు అద్భుతమైన అవకాశం వచ్చినట్టయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+