ప్రవళిక హత్య కేసు: శివరాం రిమాండ్‌ను తిరస్కరించిన కోర్టు, కారణం ఇదే

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రవళిక హత్య కేసులో నిందితుడుగా ఉన్న శివరాం రాథోడ్‌ కోర్టులో లొంగిపోయాడు. నిందితుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో శివరాం తరుఫు న్యాయవాది మెమో దాఖలు చేశారు.

కోర్టులో విచారణ జరిగిన అనంతరం.. శివరాం రిమాండ్​ పిటిష‌న్‌​ను ఎలాంటి ఆధారాలు లేనందున నాంపల్లి కోర్టు తిరస్కరించింది. చాటింగ్ ఆధారాలతో రిమాండ్ ఎలా చేస్తారని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. దీంతో పాటు కేసు దర్యాప్తు జరుగుతున్నందున రిమాండ్​ ఇవ్వలేమని కోర్టు వెల్లడించింది.

nampally court rejects accused sivaram remand petition pravallika murder case.

కేసు పూర్తి వివరాలు తెలియజేస్తామని శివరాం న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం ప్రవళిక ఆత్మహత్యకు కారణమని శివరాంపై కేసు నమోదు చేసింది. దీంతో కోర్టులోనే శివరాంను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్​ స్టేషన్‌​కు తరలించారు. శనివారం ఉదయం మళ్లీ కోర్టులో హాజరుపర్చనున్నారు.

కాగా, అక్టోబర్ 13న వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక.. హైదరాబాద్​ చిక్కడపల్లిలోని తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. ఆమె ప్రియుడు శివరాం పెళ్లి చేసుకుంటానని.. మోసం చేయడంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిక్కడ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఆత్మహత్యపై పోలీసులు మృతురాలి స్నేహితులను ప్రశ్నించారు. శివరాంతో పరిచయం గురించి వారు తెలిపారు. దీంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. మరోవైపు ప్రవళిక చనిపోయినప్పటి నుంచి శివరాం కనిపించకపోవడం కూడా వారి అనుమానాలు ఎక్కువ అయ్యాయి. ఆమె సెల్‌​ఫోన్​లోని వాట్సప్ చాట్, డేటా రికవరీ చేసి శివరాం వేధింపుల వల్లే చనిపోయిందని నిర్థరణకు వచ్చారు. ఇదే విషయాన్ని ప్రవళిక కుటుంబ సభ్యులు కూడా రెండు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి వివరించారు. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని కోరారు.

అయితే, శివరాం, అతని బంధువులు మాత్రం ప్రవళిక ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. ప్రవళిక ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తమకు తెలియదని చెబుతున్నారు. తాము ఎక్కడికీ పారిపోలేదని చెప్పారు. ఇప్పటికే పోలీసులు వేధిస్తున్నారంటూ శివరాం బంధువులు హెచ్చార్సీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+